OTT: ఓటీటీలో సూపర్ హిట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ అంతే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇతర జానర్లతో పోలిస్తే ఓటీటీలో సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలకు కాస్త క్రేజ్ ఎక్కువ. థియేటర్లలో హిట్ కాకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై ఈ సినిమాలు అదరగొడుతుంటాయి. ముఖ్యంగా ఇటీవల ఓటీటీలో హారర్ సినిమాలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. అందుకు తగ్గట్టే వివిధ ఓటీటీ సంస్థలు వారానికి కనీసం ఒక్క హారర్ మూవీనైనా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొస్తుంటాయి

OTT: ఓటీటీలో సూపర్ హిట్ తెలుగు హారర్ థ్రిల్లర్.. ట్విస్టులకు మైండ్ బ్లాక్ అంతే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Kalinga Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 28, 2024 | 3:58 PM

ఇతర జానర్లతో పోలిస్తే ఓటీటీలో సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ సినిమాలకు కాస్త క్రేజ్ ఎక్కువ. థియేటర్లలో హిట్ కాకపోయినా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై ఈ సినిమాలు అదరగొడుతుంటాయి. ముఖ్యంగా ఇటీవల ఓటీటీలో హారర్ సినిమాలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. అందుకు తగ్గట్టే వివిధ ఓటీటీ సంస్థలు వారానికి కనీసం ఒక్క హారర్ మూవీనైనా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. అలా త్వరలోనే మరో సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదే ఇటీవల థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన కళింగ. కిరోసిన్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ధృవ వాయు ఇందులో హీరోగా నటించాడు. అంతేకాదు దర్శకత్వ బాధ్యతలు కూడా అతనే చూసుకున్నారు. . ప్ర‌గ్యా న‌య‌న్ హీరోయిన్‌గా న‌టించింది. సెప్టెంబర్‌ 13న విడుదలైన కళింగ సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద భారీగానే కలెక్షన్లు వచ్చాయి. కళింగ సినిమాకు సుమారు రూ. 5కోట్ల మేరకు కలెక్షన్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హారర్‌ ఎలిమెంట్స్‌కు కాస్త ఫాంటసీ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. థియేటర్లలో ఆడియెన్స్ ను మెప్పించిన కళింగ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో కళింగ సినిమా ఓటీటీ రిలీజ్ పై అప్డేట్ వచ్చింది. త్వరలోనే ఈ హారర్ మూవీని స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది ఆహా. ‘కళ్లు మూసిన, తెరిచిన…కనుమల్లో దాగున్న ఆ రూపం’ అంటూ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అయితే అధికారిక స్ట్రీమింగ్ తేదీ మాత్రం వెల్లడించలేదు. కాగా అక్టోబర్‌ 2 నుంచి కళింగ చిత్రం స్ట్రీమింగ్‌ అవుతుందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై ఆహా నుంచి అధికారిక ప్రకటన రానుందని సమాచారం. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన కళింగ సినిమాలో మీసాల ల‌క్ష్మ‌ణ్‌, ఆడుకాలం న‌రేన్‌, బ‌ల‌గం సుధాక‌ర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మరి థియేటర్లలో కళింగ సినిమాను మిస్ అయ్యారా? అయితే త్వరలోనే ఓటీటీలోకి వస్తోంది. ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్..

కళింగ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!