OTT Movies: అక్టోబర్‏లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‏లు ఇవే.. దసరా సెలవుల్లో అన్‏లిమిటెడ్ ఫన్..

వచ్చే నెలలో దాదాపు ఏఢు సినిమాలు.. సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలను కూడా అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. హారర్, క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీతోపాటు.. మనసుకు హత్తుకునే ఫ్యామిలీ డ్రామా.. బ్యూటీఫుల్ లవ్ స్టోరీ చిత్రాలను కూడా స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారు. మరీ దసరా సెలవులలో ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు

OTT Movies: అక్టోబర్‏లో ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‏లు ఇవే.. దసరా సెలవుల్లో అన్‏లిమిటెడ్ ఫన్..
Ott Movies
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 28, 2024 | 8:31 AM

దసరా పండగ రాబోతుంది. మరో నాలుగు రోజుల్లో శరన్నావరాత్రులు ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల అంటే అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ సంబరాలు షూరు కానుండగా.. ఆ మరుసటి రోజే దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఇక అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో దసరా సెలవులు మొదలుకానున్నాయి. ఈ క్రమంలోనే సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సరికొత్త వెబ్ సిరీస్, సూపర్ హిట్ చిత్రాలను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. వచ్చే నెలలో దాదాపు ఏఢు సినిమాలు.. సిరీస్ లు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతోపాటు ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలను కూడా అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. హారర్, క్రైమ్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీతోపాటు.. మనసుకు హత్తుకునే ఫ్యామిలీ డ్రామా.. బ్యూటీఫుల్ లవ్ స్టోరీ చిత్రాలను కూడా స్ట్రీమింగ్ చేయాలని చూస్తున్నారు. మరీ దసరా సెలవులలో ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ లపై ఓ కన్నేయ్యండి.

  • సౌత్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన సినిమా ఆకాశమే నీ హద్దురా. ఈమూవీకి రీమేక్ గా వచ్చిన హిందీ సినిమా సర్పిరా అక్టోబర్ 11 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
  • ఈ సినిమాతోపాటు బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ సీటీఆర్ఎల్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో అక్టోబర్ 4 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
  • లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అమర్ ప్రేమ్ కీ ప్రేమ్ కహానీ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోలోకి రానుంది. అక్టోబర్ 4 నుంచి డిజిటల్ ప్రీమియర్ అవుతుంది.
  • కార్తీకేయ 2 ఫేమ్, బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో నటించిన ది సిగ్నేచర్ సినిమా అక్టోబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
  • ఎప్పటిలాగే మరోసారి మర్డర్ మిస్టరీ వెబ్ సిరీస్ హారర్ మూవీ లవర్స్ కోసం రానుంది. మన్వత్ మర్డర్స్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో అక్టోబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హత్యల నేపథ్యంలో సాగే ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పై మంచి బజ్ నెలకొంది.
  • రొమాంటిక్ డ్రామాగా వచ్చిన ఫ్యాబ్యులెస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్ సీజన్ 3 వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అక్టోబర్ 18న రిలీజ్ కానుంది.
  • మలయాళంలో డ్రామా చిత్రంగా రూపొందించిన వాళై ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అక్టోబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మొత్తానికి ఈ దసరా సెలవులలో సినీ ప్రియుల కోసం విభిన్నమైన కథాంశాలను తీసుకువస్తున్నారు మేకర్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.