Police Story OTT: ఓటీటీలో క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్.. ‘పోలీస్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బాషా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రజనీని ఎంతో స్టైలిష్‌గా చూపించారాయన. ఈ సినిమాతోనే డైరెక్టర్ సురేష్ కృష్ణ పేరు మార్మోగిపోయింది. బాషా తర్వాత రజనీకాంత్‌తోనే బాబా సినిమాను తీశారాయన. అలాగే చిరంజీవితో మాస్టర్, డాడీ, నాగార్జునతో ఆటో డ్రైవర్, మోహన్‌బాబుతో రాయలసీమ రామన్న చౌదరి
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బాషా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముంబై మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రజనీని ఎంతో స్టైలిష్‌గా చూపించారాయన. ఈ సినిమాతోనే డైరెక్టర్ సురేష్ కృష్ణ పేరు మార్మోగిపోయింది. బాషా తర్వాత రజనీకాంత్‌తోనే బాబా సినిమాను తీశారాయన. అలాగే చిరంజీవితో మాస్టర్, డాడీ, నాగార్జునతో ఆటో డ్రైవర్, మోహన్‌బాబుతో రాయలసీమ రామన్న చౌదరి, ప్రభాస్‌తో రాఘవేంద్ర లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు సురేష్ కృష్ణ. అయితే సుమారు పదేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు నిర్మాతగా మారారు. సురేష్ కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యానర్‌పై పోలీస్ స్టోరీ కేస్ వన్ పేరుతో ఓ తెలుగు సినిమాని నిర్మించారు. రామ్ విఘ్నేష్ డైరెక్ట్ చేసిన ఈ క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ డైరెక్టుగా ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో జులై 28 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
పోలీస్ స్టోరీ కేస్ వన్‌లో శ్రీనాథ్ మాగంటి, శ్వేతా అవస్థి హీరో, హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజైంది. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో అర్ధరాత్రి 12 గంటలకు హత్య జరుగుతుంది. క్రైమ్ నవలలు, సినిమాలు చూసి నేరాల నుంచి తప్పించుకునే క్రిమినల్‌ను పోలీస్ ఎలా పట్టుకున్నాడు? అనేది ఈ సినిమా కథ. పోలీస్ స్టోరీ కేస్ వనకు మీనాక్షి భుజంగ్ స్వరాలు సమకూర్చారు.
Can @srinathmaganti 👮♂️ solve the mystery of this corporate crime? Find out in #PoliceStory! 🎬
A Win Original Film #PoliceStory from the director of #Basha premieres July 28
🎞️ #PoliceStory 🏠 #Skproductions 💰 @suresh_krissna 🎬 @ramvigneshr 🎼 #MeenakshiBhujng pic.twitter.com/29uyvJw2O3
— ETV Win (@etvwin) July 22, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.