Squid Game 2: ప్రాణాలు తీసే ఆట మళ్లీ వస్తోంది.. స్క్విడ్‌ గేమ్‌ 2 టీజర్ చూశారా? ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సుమారు మూడేళ్ల క్రితం అంటే 2021లో ఓటీటీలో విడుదలైన స్క్విడ్ గేమ్‌ వెబ్ సిరీస్ రికార్డులు కొల్లగొట్టింది. ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు స్క్విడ్ గేమ్స్ సీజన్ 2 కూడా వస్తోంది. తాజాగా రెండో సీజన్ కు సంబంధించిన టీజర్ ఇటీవలే రిలీజైంది.

Squid Game 2: ప్రాణాలు తీసే ఆట మళ్లీ వస్తోంది.. స్క్విడ్‌ గేమ్‌ 2 టీజర్ చూశారా? ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Squid Game Season 2
Follow us
Basha Shek

|

Updated on: Nov 03, 2024 | 8:45 AM

కొరియన్ వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’ చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీసుల్లో ఒకటి. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో మొదటిసారి ఈ వెబ్ సిరీస్ విడుదలైనప్పుడు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఇందులోని కంటెస్టెంట్స్ భారీ ప్రైజ్ మనీని గెల్చుకునేందుకు కొన్ని గేమ్స్ ఆడుతుంటారు. అయితే ఇక్కడ గేమ్ లో ఓడిపోయిన వ్యక్తి ఇంటికి వెళ్లకుండా చనిపోతాడు. అన్ని ఆటలలో గెలిచి, ప్రమాదాల నుండి బయటపడిన వ్యక్తే విజేత అవుతాడు. భారీ ప్రైజ్ మనీ సొంతం చేసుకుంటాడు. ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ 2021 సెప్టెంబర్ నెలలో విడుదలైంది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో సినీ ప్రేక్షకులు ఈ వెబ్ సిరీస్ ను వీక్షించారు. ‘స్క్విడ్ గేమ్స్’ ప్రపంచంలో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్‌లలో ఒకటి. అంతేకాదు ఈ సిరీస్ కారణంగా నెట్‌ఫ్లిక్స్‌కు భారీ లాభాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ క్రేజీ వెబ్ సిరీస్ కు రెండో సీజన్ ను అనౌన్స్ చేశారు. సుమారు మూడేళ్ల తర్వాత ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ విడుదల కానుంది.

ఇటీవల ‘స్క్విడ్ గేమ్’ సీజన్ 2 టీజర్ విడుదలైంది. మొదటి సీజన్ విజేత సియోంగ్ గి-హున్ ఇప్పుడు రెండవ సీజన్‌లో మళ్లీ గేమ్ ఆడడానికి వచ్చాడు.గ్రీన్‌ లైట్‌, రెడ్‌ లైట్‌ వంటి గేమ్స్‌ నే మరోసారి ఈ సీజన్‌లోనూ చూపించారు. గత సీజన్‌లో ఈ ఆటలో విజేతగా నిలిచిన 456వ పోటీదారుడు సియోంగ్ గి-హున్ ఇందులో మళ్లీ పాల్గొనడం.. ఇది ప్రమాదకరం ఇక్కడినుంచి వెళ్లిపోదామని తోటివారిని హెచ్చరించడం వంటి సన్నివేశాలతో ఈ టీజర్‌ ఆసక్తికరంగా సాగింది.

ఇవి కూడా చదవండి

డిసెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్..

ప్లేయర్ల యూనిఫాంలు మొదటి సీజన్‌లో మాదిరిగానే ఉన్నాయి. ఆటగాళ్ల ముఖాలు కనిపించ కుండా కవర్ చేశారు. ఈసారి గేమ్ ఆడే మెయిన్ విలన్ ఎవరో కూడా చూపించారు. మొదటి సీజన్‌లో విలన్ ను సీక్రెట్ గా ఉంచారు. ‘స్క్విడ్ గేమ్’ సీజన్ 2 డిసెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. మొదటి సీజన్‌కు దర్శకత్వం వహించిన కొరియన్ హ్వాంగ్ డాక్ హ్యూక్ రెండవ సీజన్‌కు కూడా దర్శకత్వం వహించారు.

స్క్విడ్‌ గేమ్‌ 2 తెలుగు టీజర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!