Hyderabad: నగరవాసులకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో పొడవైన ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ట్రాఫిక్ కష్టాలు కొంత మేర తీరిపోనున్నాయి.నెహ్రూ జూపార్కు నుండి ఆరాంఘర్ వరకు చేపట్టిన ఆరు లేన్ల అతిపెద్ద ఫ్లైఓవర్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారంనాడు (జనవరి 06న) ప్రారంబించనున్నారు. దాదాపు 4 కిలో మీటర్ల పొడవైన ఈ ఫ్లై ఓవర్‌ను రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టారు.
హైదరాబాద్, 05 జనవరి 2025: గ్రేటర్ హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు నిర్మించిన మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. నెహ్రూ జూపార్కు నుండి ఆరాంఘర్ వరకు చేపట్టిన ఆరు లేన్ల అతిపెద్ద ఫ్లైఓవర్ గా అందుబాటులోకి రానున్నది. ఈ ఫ్లై ఓవర్‌ను రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం (జనవరి 6న) సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. ఎస్.ఆర్.డి.పి ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టిన ఫ్లైఓవర్లు ఇది కూడా ఒకటి కావడం విశేషం.
హైదరాబాద్ నగరంలో పివి ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత రెండో అతి పొడవైన ఫ్లై ఓవర్ గా ఇది నిలుస్తుంది. రూ.736 కోట్ల అంచనా వ్యయంతో సుమారు 4 కిలోమీటర్ల పై బడిన పొడవు గల 6 లేన్ల ఫ్లై ఓవర్ ను చేపట్టారు. ప్రధాన ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యినందున సీఎం రేవంత్ రెడ్డి జనవరి 6 సోమవారం ప్రారంభించనున్నారు. ఇంతకు ముందు బైరమల్ గూడ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఎస్.ఆర్.డి.పి ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టిన 42 పనులలో ఇప్పటి వరకు 36 పనులు పూర్తయ్యాయి.
సికింద్రాబాద్, వరంగల్ ఉమ్మడి జిల్లా, హుజురాబాద్, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్ గిరి వాసులకు శంషాబాద్ విమానాశ్రయానికి వరకు అక్కడి నుండి తిరుగు ప్రయాణంలో ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సిగ్నల్ ఫ్రీ రవాణాకు వెసులుబాటు ఉంది. ఉప్పల్ నుండి నాగోల్, కామినేని, ఎల్ బి నగర్ జంక్షన్, బైరమల్ గూడ, (ఓవైసీ జంక్షన్) అబ్దుల్ కలాం ఫ్లైఓవర్, చాంద్రాయణ గుట్ట ఫ్లై ఓవర్ ట్రాఫిక్ అంతరాయం లేకుండా వేగంగా నిర్దేశించిన సమయంలో చేరవలసిన గమ్యస్థానానికి చేరుకోవడంతో పాటు తక్కువ ఇంధన వాడకం, కాలుష్య రహితంగా వెళ్లేందుకు వాహనదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజ్ ను మరింత పెంచేందుకు ఫ్లై ఓవర్లు దోహదపడే అవకాశముంది.
అంతేకాకుండా ఇమ్లిబన్ బస్ స్టేషన్ నుండే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రవేటు బస్సులు ఇతర వాహనాలు రోజుకు 1700 నుండి 2000 వరకు రోజు ఇతర ప్రాంతాలకు వెళుతుంటాయి. ఆరాంఘర్ నుండి జూ పార్కు వరకు ట్రాఫిక్ సమస్య లేకుండా నేరుగా వెళ్లేందుకు ఆరు లేన్ల అతి పెద్ద ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ లో పివీ నరసింహారావు ఎక్సప్రెస్ ఫ్లై ఓవర్ 4 లైన్ల ఫ్లైఓవర్ కాగా ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ఆరు లైన్ల తో 4 కిలోమీటర్ల పైగా పొడవుతో చేపట్టగా ఎస్ ఆర్ డి పి ద్వారా చేపట్టిన అతిపెద్ద ఫ్లై ఓవర్ గా నిలుస్తుంది.
ఈ నేపథ్యంలో నెహ్రూ జూ పార్క్ – ఆరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రధాన ఫ్లై ఓవర్ ను ప్రారంభించడంతో వాహన దారులకు ఇబ్బందులు తొలగి పోనున్నాయి. ఈ ఫ్లైఓవర్ కు సంబంధించిన మిగతా పనులు ఇరువైపులా ర్యాంపులు, సర్వీస్ రోడ్డు వచ్చే మార్చి, 2025 లోపు పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఎస్.ఆర్.డి.పి ద్వారా చేపట్టిన 42 పనులలో 22 ఫ్లై ఓవర్లు, 5 అండర్ పాస్ లు, 6 ఆర్ ఓ బి లు మరో మూడు వివిధ రకాల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి మరో ఫ్లైఓవర్
Aramghar to Zoo Park flyover to be opened tomorrow pic.twitter.com/JWrpnB60j4
— Naveena (@TheNaveena) January 5, 2025
ప్రజాపాలన – ప్రజా ప్రభుత్వంలో హైదరబాద్ ఇమెజ్ ను అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధి గావించే నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిహైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో హైద్రాబాద్ లో వ్యూహాత్మక పథకాలను ఒకే గొడుగు క్రిందికి తెచ్చి సమగ్ర ప్రగతి చేసేందుంకు హెచ్ సిటి ( హైదరాబాద్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రాన్స్పరెన్సీ ఇన్నోవేటివ్ ) ద్వారా రూ.7032 కోట్లు రూపాయలతో 38 పనులను చేపట్టేందుకు పరిపాలన అనుమతి ఇచ్చారు.ఈ నిధులతో సుమారు 38 పనులైన ఫ్లై ఓవర్లు, ఉండర్ పాస్‌లు, అర్ ఓ బి లు చేపట్టనున్నారు. ఈ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న కే బి అర్ పార్కు నలు దిక్కుల 4 జంక్షన్ లా వద్ద ట్రాఫిక్ జామ్ లేకుండా నేరుగా వెళ్లేందుకు ప్రతి జంక్షన్ వద్ద ఒక అండర్ పాస్ తో కలిసి ఫ్లై ఓవర్ మొత్తం 4 ఫ్లై ఓవర్ లు. మరో 4 అండర్ పాసులు నిర్మాణాలు పూర్తయితే హైదరాబాద్ రూపు లేఖలు మారి పోయే అవకాశం ఉంటుంది అందుకు ప్రజా ప్రభుత్వంలో పెద్ద పేట్ వేసి సంవత్సరం లోపు పూర్తి చేసేందుకు టెండర్ పక్రియ త్వరలో పూర్తి చేసి పనులను కూడా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.