Adhikara Yoga: రవి, శనుల యుతి.. త్వరలో ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!

Telugu Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం రవి, శని గ్రహాలను తండ్రీ కుమారులుగా పరిగణిస్తారు. అయితే ఈ రెండు గ్రహాల మధ్య బద్ధ శత్రుత్వం ఉంటుంది. ఈ రెండు గ్రహాలు ఫిబ్రవరి 16 నుంచి మార్చి వరకూ కుంభ రాశిలో కలిసి సంచరించనున్నాయి. ఈ రెండు గ్రహాల యుతి కారణంగా కొన్ని రాశులకు అధికార యోగం పట్టడం, ఉద్యోగం మారడం, ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకోవడం, నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడం వంటివి జరుగుతాయి.

Adhikara Yoga: రవి, శనుల యుతి.. త్వరలో ఆ  రాశుల వారికి అధికార యోగం పక్కా..!
Adhikara Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 05, 2025 | 10:06 PM

జ్యోతిషశాస్త్రం ప్రకారం రవి, శనులు తండ్రీ కుమారులు. అయితే, వీరిద్దరి మధ్యా బద్ధ శత్రుత్వం ఉంటుంది. ఈ రెండు గ్రహాలు ఫిబ్రవరి 16 నుంచి మార్చి వరకూ కుంభ రాశిలో కలిసి ఉండడం జరుగుతోంది. కుంభ రాశి శనికి స్వక్షేత్రం కానీ రవికి మాత్రం శత్రు క్షేత్రం. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులకు అధికార యోగం పట్టడం, ఉద్యోగం మారడం, ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకోవడం, నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించడం వంటివి జరుగుతాయి. మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు రాశుల వారికి ఈ రవి, శనుల యుతి వల్ల విపరీత రాజయోగాలు, రాజపూజ్యాలు కలుగుతాయి.

  1. మేషం: ఈ రాశికి లాభ స్థానంలో రవి, శనులు కలుస్తున్నందువల్ల ఇబ్బడిముబ్బడిగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడానికి అవకాశం ఉంది. శీఘ్ర పురోగతి కూడా ఉంటుంది. తండ్రి నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. అనారోగ్యాలకు సరైన వైద్య చికిత్స లభి స్తుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపా రాల్లో పోటీదార్లు, ప్రత్యర్థుల మీద పైచేయి సాధిస్తారు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
  2. వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో రవి, శనుల యుతి వల్ల సీనియర్లను కాదని పదోన్నతి పొందడం జరు గుతుంది. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబం ధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఆశించిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇష్టమైన ప్రాంతాలకు స్థాన చలన సూచనలున్నాయి. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. పితృ సౌఖ్యం లభిస్తుంది. విదేశీయానానికి సంబంధించిన సమస్యలు, ఆటంకాలు తొలగిపోవడం జరుగుతుంది.
  3. మిథునం: ఈ రాశికి భాగ్య స్థానంలో రవి, శనుల యుతి జరుగుతున్నందువల్ల విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. తండ్రి నుంచి అనేక విధాలుగా సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది.
  4. కన్య: ఈ రాశికి ఆరవ స్థానంలో శని, రవులు కలవడం వల్ల విపరీత రాజయోగం కలుగుతుంది. దీనివల్ల ఉద్యోగంలో అందలాలు ఎక్కడం, వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరగడం, శత్రువుల మీద పైచేయి సాధించడం, వివాదాలు, కేసులు అనుకూలంగా పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. అనా రోగ్యాల నుంచి కూడా చాలావరకు కోలుకుంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ప్రము ఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది.
  5. తుల: ఈ రాశికి పంచమ స్థానంలో పంచమ స్థానాధిపతి శని, లాభ స్థానాధిపతి రవి కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో మీ సమర్థతకు, శక్తి సామర్థ్యాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. జీతభత్యాలు, హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. పిల్లలు బాగా వృధ్ధిలోకి వస్తారు. ఘన విజయాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మన సులోని కోరికలు, ఆశలు నెరవేరుతాయి. పెళ్లి ప్రయత్నాలు, ప్రేమ వ్యవహారాల్లో విజయాలు వరిస్తాయి.
  6. ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానంలో రవి, శనుల కలయిక వల్ల అనేక విధాలుగా పురోగతి ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ తో పాటు ఆదాయం బాగా పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ప్రయాణాల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది.

ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా.. స్వ్కాడ్‌లో 15 మంది ఆటగాళ్లు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా.. స్వ్కాడ్‌లో 15 మంది ఆటగాళ్లు