Maha Samudram: మహా సముద్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ యుద్ధం.. డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఆ ఓటీటీ సంస్థ..

ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న సినిమా మహా సముద్రం. ఇందులో టాలెంటెడ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ

Maha Samudram: మహా సముద్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ యుద్ధం.. డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఆ ఓటీటీ సంస్థ..
Maha Samudram
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 12, 2021 | 8:52 AM

ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి ప్రస్తుతం తెరకెక్కిస్తోన్న సినిమా మహా సముద్రం. ఇందులో టాలెంటెడ్ హీరో శర్వానంద్, సిద్ధార్థ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాతోనే.. సిద్ధార్థ్ మళ్లీ టాలీవుడ్‏లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. విభిన్న కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో అదితీరావు, అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. భారీ బడ్జెట్‏తో ఏకే ఎంటర్‏టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా.. ఇటీవల విడుదలైన మహాసముద్రం ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ ట్రైలర్లో ఉన్న డైలాగ్స్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాను చూడటానికి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మహాసముద్రం విడుదల అనంతరం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‏ మహా సముద్రం డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‏ను దక్కించుకున్నట్లుగా సమాచారం. థియేటర్లలో విడుదలైన తర్వాత.. మహా సముద్రం నెట్ ఫ్లిక్స్‏లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో జగపతి బాబు, రావు రమేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. అలాగే చైతన్య భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Also Read: Anasuya: వెండితెరపై దూసుకుపోతున్న అందాల యాంకరమ్మ.. మరో స్పెషల్ సాంగ్‏లో అనసూయ..

Maa Elections 2021: ఎలక్షన్స్ రోజున శివ బాలాజీ చెయ్యి కొరికిన హేమ.. శివబాలాజీ భార్య సంచలన వ్యాఖ్యలు..

Vanitha Vijay Kumar: సమంతకు పెరుగుతున్న మద్దతు.. రంగంలోకి దిగిన వనితా విజయ్ కుమార్.. ఏమన్నదంటే..

Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. ఈవారం నామినేట్ అయిన సభ్యులు ఎవరెవరంటే.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!