Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. ఈవారం నామినేట్ అయిన సభ్యులు ఎవరెవరంటే..

బిగ్‏బాస్ ఐదువారాలు ముగించుకుని ఆరో వారంలోకి ఎంటర్ అయ్యింది. కంటెస్టెంట్స్‏కు నామినేషన్స్ డే ఉత్కంఠతో సాగుతుంది.

Bigg Boss 5 Telugu: రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. ఈవారం నామినేట్ అయిన సభ్యులు ఎవరెవరంటే..
Bigg Boss
Follow us
Rajitha Chanti

| Edited By: Anil kumar poka

Updated on: Oct 12, 2021 | 5:13 PM

బిగ్‏బాస్ ఐదువారాలు ముగించుకుని ఆరో వారంలోకి ఎంటర్ అయ్యింది. కంటెస్టెంట్స్‏కు నామినేషన్స్ డే ఉత్కంఠతో సాగుతుంది. బిగ్‏బాస్ నామినేట్ చేయాల్సిన కంటెస్టెంట్స్ ఫోటోలను మంటల్లో వేస్తూ తమ అభిప్రాయాలను చెప్పాలని ఆదేశించాడు. ఇంకేముంది కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. ఒకరిపై మరొకరు వాగ్వాదానికి దిగడమే కాకుండా.. వార్నింగ్స్ ఇచ్చుకున్నారు.

ఇక నిన్నటి ఎపిసోడ్‏లో ముందుగా వచ్చిన సన్నీ.. యాంకర్ రవి, జెస్సీలను నామినేట్ చేశాడు. కొన్ని టాస్కుల్లో వెన్నునొప్పి అని తప్పించుకోవడం తనకు నచ్చలేదని రవిని నామినేట్ చేశాడు. ఇక ఆ తర్వాత.. టాస్కు పరంగా.. జెస్సీ ప్రవర్తన నచ్చలేదని.. పైగా తాను డబ్బు కోసం ఆట ఆడాను. రవి ప్రజల కోసం ఆట ఆడాడు అనే స్టేట్మెంట్ నచ్చలేదని జెస్సీని సన్ని నామినేట్ చేశాడు. ఇక విశ్వ.. యానీ మాస్టర్, ప్రియాంకలను నామినేట్ చేశాడు. ప్రతిసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అని నామినేట్ చేయడం తనకు నచ్చలేదని యానీ మాస్టర్ ను.. సంచాలక్ గా ఉన్న సమయంలో తను ఓ నిర్ణయం చెబితే ప్రియాంక తప్పుగా అర్థం చేసుకుందని నామినేట్ చేశాడు. ఇక శ్వేత.. సిరి, కాజల్‏ను నామినేట్ చేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన లోబో ప్రియాంక, జెస్సీలను నామినేట్ చేశాడు. ఇక సిరి.. శ్రీరామచంద్ర, శ్వేతలను నామినేట్ చేసింది.

ఆ తర్వాత.. రవి.. మానస్, సిరిలను నామినేట్ చేశాడు. అనంతరం.. జెస్సీ… శ్రీరామచంద్ర, సన్నీలను నామినేట్ చేశాడు. ప్రియాంక… లోబో, విశ్వలను నామినేట్ చేసింది. మానస్.. రవి, లోబోలను నామినేట్ చేశాడు… ఇక యానీ మాస్టర్.. విశ్వ, షణ్ముఖ్‎లను నామినేట్ చేసింది. శ్రీరామచంద్ర.. సిరి, షణ్ముఖ్‏లను నామినేట్ చేశాడు. కాజల్.. శ్రీరామచంద్ర, శ్వేతలను నామినేట్ చేసింది. ఇక షణ్ముఖ్.. శ్రీరామచంద్ర, లోబోలను నామినేట్ చేశాడు. ఇక చివరన వచ్చిన ప్రియ.. విశ్వ, సన్నీలను నామినేట్ చేసింది. మొత్తానికి ఈవారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు షణ్ముఖ్, ప్రియాంక, లోబో, శ్రీరామచంద్ర, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్ అయ్యారు.

Also Read: Shriya Saran: అభిమానులకు దిమ్మతిరిగే అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చిన హాట్ బ్యూటీ

Anubhavinchu Raja: నాగచైతన్య చేతులమీదుగా ‘అనుభవించు రాజా’ ఫస్ట్ సాంగ్..

Love Story: ఓటీటీలో ప్రత్యక్షంకానున్న నాగచైతన్య- సాయిపల్లవిల ‘లవ్ స్టోరీ’.?