Prakash Raj Vs MAA: ‘మా’ రెండుగా చీలి పోనుందా.. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా చేయనున్నారా..

Prakash Raj Vs MAA: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి సాధారణ ఎన్నికలను తలపిస్తూ జరిగాయి. ప్రాంతీయ వాదంతో జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు 'మా' అధ్యక్షుడిగా..

Prakash Raj Vs MAA: 'మా' రెండుగా చీలి పోనుందా.. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు రాజీనామా చేయనున్నారా..
Prakash Raj
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 12, 2021 | 5:16 PM

Prakash Raj Vs MAA: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ఈసారి సాధారణ ఎన్నికలను తలపిస్తూ జరిగాయి. ప్రాంతీయ వాదంతో జరిగిన మా ఎన్నికల్లో మంచు విష్ణు ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. దీంతో మేము అంతా ఒకే కుటుంబం.. మాది సినీ కుటుంబం అంటూ.. అందరూ ఒకే తాటిమీదకు వస్తారని.. ఇక మా లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి అనుకున్నారు అందరూ… అయితే ఇప్పుడు మా లో ముసలం పుట్టినల్టు టాక్ వినిపిస్తోంది. ‘‘మా’.. మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ నుంచి కొంతమంది బయటకు వచ్చి.. సరికొత్త సంస్థను నెలకొల్పనున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అవును మాలో ఏర్పడిన విబేధాలు,, బేధాభిప్రాయాలు ఇంకా కొనసాగుతున్నట్లు తాజా పరిణామాల బట్టి తెలుస్తోంది. దీంతో మాలో గొడవలు సర్దుమణగలేదని.. అవి ఇంకా కొనసాగుతున్నాయని తాజా పరిణామాల ద్వారా తెలుస్తోంది.

ప్రకాష్ రాజు తరపున పోటీ చేసిన వాళ్ళు గెలిచిన వాళ్ళు అందరు కూడా ఈ రోజు రాజీనామా చేసే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ ఓ పుకారు షికారు చేస్తుంది.  అంతేకాదు వీరు ‘మా’ కు పోటీగా ‘ఆల్‌ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(ఆత్మ)’ అనే అసోషియేషన్ నెలకొల్పనున్నారని టాక్.  ఇప్పటికే ప్రకాష్ రాజ్ ఆత్మ కోసం భవనాన్ని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి.. సభ్యుల రాజీనామా గురించి ఆత్మ గురించి ప్రకటించనున్నారని తెలుస్తోంది.

ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి బెనర్జీ, శ్రీకాంత్‌, ఉత్తేజ్‌,  శివారెడ్డి, బ్రహ్మాజీ, ప్రభాకర్‌, తనీష్‌, సురేశ్‌ కొండేటి, సమీర్‌, సుడిగాలి సుధీర్‌, కౌశిక్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే..

Also Read:  అంగరంగ వైభంగా మైసూర్ దసరా ఉత్సవాలు.. బంగారు చీరలో చాముండేశ్వరిదేవి దర్శనం..