Sathigani Rendekaralu: ‘సత్తిగాని రెండెకరాలు’ ట్రైలర్ రిలీజ్.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..

ఇందులో వెన్నెల కిశోర్‌, అనీషా, మోహన శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే గతంలోనే ఈమూవీ షూటింగ్ కంప్లీట్ కగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అయితే పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఆహాలోకి వచ్చేస్తోంది. మే 26 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

Sathigani Rendekaralu: 'సత్తిగాని రెండెకరాలు' ట్రైలర్ రిలీజ్.. ఆహాలో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..
Sattigani Rendakaralu
Follow us
Rajitha Chanti

|

Updated on: May 24, 2023 | 5:52 PM

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయ్యారు నటుడు జగదీశ్. ఇందులో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవ పాత్రలో తన నటనతో మెప్పించాడు జగదీశ్. ఇప్పుడు ఆయన ప్రధాన పాత్రలో రూపొందించిన సినిమా సత్తిగాని రెండెకరాలు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీకి అభినవ్ దండ దర్శకత్వం వహించారు. ఇందులో వెన్నెల కిశోర్‌, అనీషా, మోహన శ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అయితే గతంలోనే ఈమూవీ షూటింగ్ కంప్లీట్ కగా.. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. అయితే పలు కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు ఆహాలోకి వచ్చేస్తోంది. మే 26 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

సత్తిగాడు ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. అయితే తన కూతురికి హార్ట్ లో హోల్ ఉండడంతో డబ్బులు అవసరం ఉంటాయి. దీంతో తనకున్న రెండెకరాల పొలాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అతను ఏం చేస్తాడు ?.. ఆ తర్వాత తన జీవితంలో ఎలాంటి సంఘటనలు జరిగాయనేదే కథ.

డార్క్ కామెడీ జోనర్లో సాగే ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పుష్ప సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన జగదీశ్.. ఈ సినిమాతో ఎంతవరకు అలరించనున్నాడో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.