AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skanda movie: ఓటీటీలోకి రాబోతున్న ‘స్కంద’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు రానుందంటే..

ట్రైలర్, టీజర్, పాటలతోనే విడుదలకు ముందే భారీ హైప్ సంపాదించుకున్న ఈ సినిమా గత నెలలో అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే మొదటి రోజు పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈసినిమా ఆ తర్వాత వరుసగా రెండు మూడు రోజులు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. కానీ ఆ తర్వాత మెల్లగా కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఈ మూవీలో ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా రామ్ నటనకు మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

Skanda movie: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడు రానుందంటే..
Skanda Movie
Rajitha Chanti
|

Updated on: Oct 11, 2023 | 8:21 PM

Share

చాలా కాలం బ్రేక్ తర్వాత ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన లేటేస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ స్కంద. డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. తొలిసారిగా రామ్ సరసన మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటించింది. ట్రైలర్, టీజర్, పాటలతోనే విడుదలకు ముందే భారీ హైప్ సంపాదించుకున్న ఈ సినిమా గత నెలలో అడియన్స్ ముందుకు వచ్చింది. అయితే మొదటి రోజు పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈసినిమా ఆ తర్వాత వరుసగా రెండు మూడు రోజులు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. కానీ ఆ తర్వాత మెల్లగా కలెక్షన్స్ తగ్గిపోయాయి. ఈ మూవీలో ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా రామ్ నటనకు మరోసారి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అయినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ సైతం ఫిక్స్ అయిందని ఫిల్మ్ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతుంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయిన నెలలోపే అంటే అక్టోబర్ 27న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు. కానీ త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తుంది. చూడాలి మరీ.. థియేటర్లలో మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా ఓటీటీలో ఎంత మేర మెప్పిస్తుందో.

ఇవి కూడా చదవండి

ఈ సినిమాలో మేజర్ బ్యూటీ సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా కీలకపాత్రలు పోషించారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా.. సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మించారు. తెలుగుతోపాటు.. తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేయగా.. కేవలం తెలుగులో మాత్రమే ఆశించిన మేర ఫలితాలొచ్చాయి. ఇదిలా ఉంటే..ప్రస్తుతం రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ ఇది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి