Lal Salaam OTT: ఆరోజే రెండు ఓటీటీల్లోకి రజనీకాంత్ ‘లాల్ సలాం’.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఇవే
లాల్ సలాం సినిమాలోని రజనీకాంత్ క్యారెక్టర్, అతని యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు బాగా నచ్చేశాయి. మొయీద్దీన్ భాయ్‌గా రజనీ ఆహార్యం, అభినయం కోసం ఒకసారి సినిమాను చూడవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలా థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న లాల్ సలామ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
జైలర్ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లాల్ సలామ్. అయితే ఇందులో ఆయన కేవలం అతిథి పాత్రలో నటించారని సినిమా యూనిట్ చెప్పింది. కానీ సినిమా మొత్తం రజనీ రోల్ చుట్టూ తిరుగుతుంది. రజనీ గారాల పట్టి ఐశ్వర్య లాల్ సలామ్ సినిమాకు దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. రజనీ సినిమా కావడంతో భారీ అంచనాలతో ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైంది లాల్ సలామ్. అయితే ఈ స్టోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామా కు నెగెటివ్ టాక్ వచ్చింఇ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ ఈ సినిమా ఆడియెన్స్ ఆదరణకు నోచుకోలేకపోయింది. స్వయంగా డైరెక్టర్ ఐశ్వర్యే తమ సినిమా పరాజయానికి గల కారణాలను ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే లాల్ సలాం సినిమాలోని రజనీకాంత్ క్యారెక్టర్, అతని యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులకు బాగా నచ్చేశాయి. మొయీద్దీన్ భాయ్‌గా రజనీ ఆహార్యం, అభినయం కోసం ఒకసారి సినిమాను చూడవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలా థియేటర్లలో మిక్స్ డ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న లాల్ సలామ్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
రెండు ఓటీటీల్లోనూ..
రజనీకాంత్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సన్ నెక్ట్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే సన్ నెక్ట్స్ తో పాటు మరో ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో కూడా లాల్ సలామ్ సినిమా స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది. మార్చి 21న సన్ నెక్ట్స్ లో కేవలం లాల్ సలామ్ తమిళ్ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి రానుందట.. అదే రోజు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో రజనీకాంత్ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు తెలిసింది. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మళ్లీ కలిసిన లాల్ సలామ్ టీమ్..
மக்களின் பேரன்பிற்கும், பேராதரவிற்கும் நன்றி!!! 🙏🏻😇 Successful 2 weeks of LAL SALAAM, into the 3rd week today! 📽️✨#LalSalaam 🫡 Running Successfully 💥📽️@rajinikanth @ash_rajinikanth @arrahman @TheVishnuVishal @vikranth_offl @Ananthika108 @LycaProductions #Subaskaran… pic.twitter.com/fcCdDYDmMu
— Lyca Productions (@LycaProductions) February 23, 2024
ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లాల్ సలామ్ సినిమా రూపొందించింది. ఏ సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రలు పోషించడం విశేషం. అలాగే లివింగ్ స్టన్, సెంతిల్, తంబి రామయ్య, నిరోషా, వివేక్ ప్రసన్నా, ధన్యా బాలకృష్ణ, తంగదురై తదితరులు కూడా వివిధ పాత్రల్లో మెరిశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లాల్ సలామ్ సినిమాకు స్వరాలు అందించడం విశేషం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి