AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suresh Babu: కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతకే మూవీపై సర్వ హక్కులు.. ఎక్కడ రిలీజ్ చేయాలనేది తన ఇష్టం.. ‘నారప్ప’ ఓటీటీపై సురేష్ బాబు క్లారిటీ..

ప్రస్తుత కరోనా కాలంలో ఓటీటీలకు ప్రేక్షాదరణ భారీగానే పెరిగిపోయింది. జనాల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త కంటెంట్‏తో అరచేతిలోనే వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీలు. దీంతో వీటిని

Suresh Babu: కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతకే మూవీపై సర్వ హక్కులు.. ఎక్కడ రిలీజ్ చేయాలనేది తన ఇష్టం.. 'నారప్ప' ఓటీటీపై సురేష్ బాబు క్లారిటీ..
Suresh Babu
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 13, 2021 | 8:01 PM

Share

ప్రస్తుత కరోనా కాలంలో ఓటీటీలకు ప్రేక్షాదరణ భారీగానే పెరిగిపోయింది. జనాల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త కంటెంట్‏తో అరచేతిలోనే వినోదాన్ని అందిస్తున్నాయి ఓటీటీలు. దీంతో వీటిని ప్రజలను కూడా ఎక్కువగానే ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలో పలువురు స్టార్ హీరో, హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కరోనా కారణంగా.. థియేటర్లు మూతపడడం.. అలాగే తిరిగి ఓపెన్ అయిన తర్వాత కేవలం 50 శాతం మందితోనే సినిమాలను ప్రదర్శించాల్సి రావడంతో.. సినిమాకు పెట్టిన ఖర్చైన వస్తుందా అనే సందీగ్ధంలో నిర్మాతలు ఉన్నారు. దీంతో తమ సినిమాలకు ఓటీటీ సంస్థలు ఇస్తున్న ఆఫర్స్‏కు ఓకే చెప్పేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం సినిమాలను థియేటర్లకు కాకుండా.. ఓటీటీలలో విడుదల చేయడం సరైనది కాదంటున్నారు. ఇప్పటికే నిర్మాతలు తమ చిత్రాలను ఓటీటీ సంస్థలకు ఇవ్వకూడదని.. తెలంగాణ ఫిలిం ఛాంబర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన నారప్ప సినిమాను జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. దీంతో సోషల్ మీడియాలో బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక నారప్ప ఓటీటీ విడుదలపై వస్తున్న వార్తలపై నిర్మాత సురేష్ బాబు స్పందించారు. కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలకే తమ సినిమాలపై పూర్తి హక్కులు ఉంటాయని.. ఎక్కడ విడుదల చేయాలనేది నిర్మాత ఇష్టమంటూ కుండ బద్దలు కోట్టాడు.. ఈ మేరకు నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. సినిమా బిజినెస్‌లో తప్పు, ఒప్పులు చూడటం సమంజసం కాదని.. ఓ సినిమా కోసం నిర్మాత కోట్లు ఖర్చు పెడతాడని.. అలాంటి నిర్మాతలకు తమ సినిమాలపై పూర్తి హక్కులు ఉంటాయని చెప్పుకొచ్చాడు. అలాగే తన సినిమాను ఎక్కడ విడుదల చేయాలనే స్వాతంత్ర్యం కూడా అతడికి ఉంటుందని చెప్పుకొచ్చాడు. కరోనా సమయంలో థియేటర్స్ యాజమాన్యమే కాదు నిర్మాతలు కూడా నష్టపోయారనే విషయాన్ని గుర్తు చేసాడు సురేష్ బాబు. అలాంటి సమయంలో మంచి రేటు వచ్చినప్పుడు సినిమాను ఓటీటీలో విడుదల చేయడం తప్పేం కాదని.. బిజినెస్ కోణంలోనే ఆలోచించాలని తెలిపాడు. ఇక సురేష్ బాబు మాటలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన మాటలను సమర్థిస్తుండగా.. మరికొందరు థియేటర్లలలోనే సినిమాలను విడుదల చేయాలని అంటున్నారు.

Also Read: Akashame Ni Haddura Movie: బాలీవుడ్‏లో రీమేక్ కానున్న సూర్య “ఆకాశమే నీ హద్దురా” మూవీ.. అఫీషియల్‏గా ప్రకటించిన హీరో..

Boycott Pavitra Rishta 2: సుశాంత్ సింగ్ స్థానంలో మరొకరిని ఊహించుకోలేము.. ఆ సీరియల్‏ను వెంటనే ఆపేయండి.. నెట్టింట్లో సుశాంత్ ఫ్యాన్స్..