Karthika Deepam:కార్తీక్ తనకు అన్యాయం చేశాడని పోలీస్ ఆఫీసర్ కు కంప్లైంట్ ఇచ్చిన మోనిత.. న్యాయం మాత్రమే చేయండి అంటున్న దీప

 Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1090 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు హైలెట్స్ ఏమిటో చూద్దాం. నా భర్త సంస్కారవంత, మర్యాదస్తుల, గౌరవనీయమైన కుటుంబంలో పుట్టినవాడు..

 Karthika Deepam:కార్తీక్ తనకు అన్యాయం చేశాడని పోలీస్ ఆఫీసర్ కు కంప్లైంట్ ఇచ్చిన మోనిత.. న్యాయం మాత్రమే చేయండి అంటున్న దీప
Karthika Deepam
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Surya Kala

Updated on: Jul 13, 2021 | 8:25 AM

Karthika Deepam: కార్తీక దీపం సీరియల్ ఈరోజు 1090 వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టింది. ఈరోజు హైలెట్స్ ఏమిటో చూద్దాం. నా భర్త సంస్కారవంత, మర్యాదస్తుల, గౌరవనీయమైన కుటుంబంలో పుట్టినవాడు.. తల్లిదండ్రి, చెల్లి తమ్ముడు ఇలా ఒక కుటుంబంలో పుట్టినవాడు.. నీలా గాలికి పెట్టి.. ధూళికి పెరిగి చిత్తుకాగిమలా పెరిగిన వాడు కాదు..నీకు తలవచాల్సిన ఖర్మ నా భర్తకు గానీ నా భర్తకు లేదు అంటుంది. పిచ్చి పిల్లా ఆకాశానికి నిచ్చెనలు వేయకు. అందని దానికోసం శీలాన్ని కూడా త్యాగం చేయకు 25వ తేదీన పెళ్లి ఆగిపోతే గుండె నొప్పి వస్తే.. మా ఆయన ఆస్పత్రిలో చేరు.. అదే పెళ్లి ఆగిపోయిందని పిచ్చి ఎక్కితే మాత్రం పిచ్చాసుపత్రిలో చేరు అంటుంది.. దీప మాటలకు మోనిత షాక్ తింటుంది. ఆ గోడ మీద నువ్వు గీసిన ఈ గీతలు చెరిగిపోయాయి. మేము ఏమీ వణికి పోలేదు.. నువ్వే రివర్స్ లో నువ్వే గజగజ వణికిపోతున్నావు. ఆ గీతాలు నేనే చెరిపేశాను. నీ తల రాతను నేనే మారుస్తాను.. . ఆ గోడమీద ఇంకా కనిపించే మరకల్లా నువ్వు మా జీవితంలో ఒక మరకవు మాత్రమే.. అది ఉంటె ఎంత చెరిపేస్తే ఎంత.. పోవే .. ఇప్పుడు ఐతే వచ్చావు.. ఇంకొకసారి.. నా మొగుడు అంటూ.. మళ్ళీ ఇక్కడికి వచ్చావో.. శ్రీరమ బస్తీ ఆడవాళ్లు చీపుర్లు, చెప్పులు తీసుకుని నిన్ను ఊరు పొలిమేర దాకా తరిమేస్తారు. మళ్ళీ నీ జీవితంలో నా జోలికి రావు .. జాగ్రత్త అని మోనిత ను దీప హెచ్చరించింది. దీంతో మోనిత అక్కడ నుంచి విసురుగా వెళ్ళిపోతుంది.

భాగ్యం మోనిత ఇంటికి వచ్చి.. ప్రియమణితో గుణవతి. గర్భవతి అయినా మీ అమ్మగారిని పిలుస్తావా.. అంటే మేడం లేదు.. అంటే ఏ కొంపకు చిచ్చు పెట్టడానికి వెళ్ళింది అంటే.. ఏమిటి అంటుంది ప్రియమణి.. మీ మేడం ఇప్పుడు లేదు.. మొత్తానికి ఈ కొంపకు రాకుండా పోతుందా.. ఈ లోకంలో లేకుండా పోతుందా అంటుంది భాగ్యం. మా అమ్మగారు వచ్చిన తర్వాత రండి.. అంటే నా ఇంట్లో కూర్చుంటే మోనిత వచ్చింది ఎలా తెలుస్తుంది. మిమ్మల్ని లోపలి రానిస్తే .. నన్ను పని నుంచి తీసేస్తారు మా అమ్మగారు అంటే.. సరేలే నీ పొట్ట ఎందుకు కొట్టాలి.. నేను బయట కూర్చుంటా అంటూ మోనిత ఇంట ముందు కూర్చుంటుంది భాగ్యం..

దీప దగ్గరకు ఆదిత్య వస్తాడు. అన్నయ్య పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చాడు ఎందుకు వదినా సమస్యల గురించి పిల్లలకు తెలియకుండా అక్కడే ఉంచుతారా.. అంటే అదేమీ లేదు.. మోనిత విషయం పిల్లల ముందు మనం మాట్లాడుకోము కదా.. అయినా మీ అన్నతో నేను సరిగ్గా మాట్లాడం లేదని.. వాళ్ళని రకరకాల అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. అందుకే మీ అన్నయ్యతో పిల్లలతో ఎప్పటిలా ఉందామని చెప్పను అంటుంది దీప. ముందు మేమిద్దరం మౌనంగా ఉండడం మానేసాం.. అన్నయ్య కూడా నీకులా ఆలోచిస్తున్నట్లు ఉన్నాడు వదిన.. అందుకే మా అత్తగారి దగ్గరకు వెళ్లి.. చాలా ప్రేమగా మాట్లాడట.. మాట గురించి అన్నయ్య చాలా ఆలస్యంగా అర్ధం చేసుకున్నాడు అంటాడు ఆదిత్య.

మోనిత సరికొత్త గేమ్ ప్లాన్ చేస్తుంది. తాను మోసపోయాను అంటూ..పోలీస్ ఆఫీసర్ రోషిణి దగ్గరకు వెళ్తుంది. ఇంట్లో ఎవరూ లేరు అని అంటే.. అనాధాశ్రమం నడపం లేదుకదా అంటుంది రోషిణి.. లేదు మేడం నేను అన్యాయానికి గురయ్యాను.. అంటే నాకు అలా అనిపించడం లేదు.. మీరు చక్కగా అందంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. ఇలాంటి ముక్కుసూటి మనిషి కావాలి. అనుకుంటూ.. నేను నా కోసం కాకపోయినా నా కడుపులో పెరిగే బిడ్డకోసం ఆరోగ్యంగా ఉండాలి.. పెళ్లి కాకుండా డాక్టర్ ఐన మీరు ఎందుకు తొందర పడ్డారు.. అంటే లేదు దగా పడ్డాను అంటే.. డాక్టర్ కార్తీక్.. అంటుంది.. ఇద్దరూ ప్రెండ్స్ కదా అతనికి పెళ్లి అయింది కదా.. ఒక గౌరవం అయినా వృత్తిలో ఉన్న మీరు ఇద్దరూ ఇలాంటి పనిచేయడం సమాజం హర్షిస్తుంది అనుకుంటున్నారా అంటే.. ఆరోజు జరిగింది చెబుతుంది రోషిణికి .. సరే మీకు వచ్చిన సమస్య ఏమిటి అంటే.. కార్తీక్ నా ముఖం చాటేస్తున్నాడు.. వాళ్ళ మొత్తం నన్ను అవాయిడ్ చేస్తున్నారు అంటూ కన్నీరు పెడుతుంది మోనిత .. మేడం నా బిడ్డ అనాథలా తండ్రిలేని బిడ్డలా పెరగానికి నేను ఒప్పుకోను.. అతనికి శిక్ష వేయమని నేను అడగడం లేదు..నా మేడలో తాళి కడితే చాలు.. నన్ను భార్యగా అంగీకరిస్తే చాలు.. సాటి స్త్రీగా ఆలోచించండి.. లేదంటే నేను ఆత్మహత్య చేసుకునిచచ్చిపోవాలి.. మీరు తప్ప నాకు సాయం చేసేవారు లేరు.. అంటూ నాకు న్యాయం చేయమని కోరుతుంది. నేను ఎంక్వరీ చేస్తాను.. న్యాయం జరిగేలా చూస్తా అని రోషిణి హామీ ఇస్తుంది. దీంతో మోనిత .. సంతోషంతో అందరూ రోడ్డునపడే సమయం వచ్చింది అంటూ వెళ్ళిపోతుంది.

కార్తీక్ పిల్లని తీసుకుని ఇంటికి వాస్తు.. బాగా చదుకోవాలి.. బాగా చదువుకోవాలి. అమ్మ నాన్న ఎందుకు మాట్లాడుకోవడం లేదు.. అంటూ ఆ ఇంటికి వెళ్లి చెప్పకూడదు.. ఈరోజు బాగా ఎంజాయ్ చేశామని అమ్మతో చెప్పమని అంటాడు..

అన్నయ్య పిల్లలు బయలు దేరారట వదిన అంటుంటే.. రోషిణి వస్తుంది. దీపని గుర్తు చేసుకున్న రోషిణి ని చూసి ఆదిత్య.. మా వదిన మిస్ అయినప్పుడు మీరే కదా కేసు ఎంక్వైరీ చేశారు. విలువలు మిస్ అయ్యాయని కంప్లైంట్ వచ్చింది. అందుకే వచ్చాను అంటుంది రోషిణి.. ఎవరు ఎవరిమీద ఇచ్చారు అని దీప అడిగితె మోనిత .. కార్తీక్ మీద ఇచ్చింది అంటుంది రోషిణి. మీ భర్త తనని మోసం చేశాడని.. మీ ఫ్యామిలీ కూడా తనని పట్టించుకోవడం లేదని.. తనకు న్యాయం చేయమని నన్ను కోరుతూ కంప్లైంట్ ఇచ్చింది. అంటుంటే.. దీప వెంటనే న్యాయం చేయండి..న్యాయమే చేయండి అంటుంది మేము అంతా కోరుకునేది అదే.. మీరు న్యాయం వైపు మాత్రమే నిలబడతారని నాకు తెలుసు.. నాపేరు దీప, నా భర్త పేరు కార్తీక్ ఫేమస్ కార్డియాలజిస్ట్ .. మాకు ఇద్దరు కవలపిల్లలు.,.. మా అత్తగారు బాగా ఉన్నవాళ్లు.. ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే మోనిత కార్తీక్ లు కలిసి చదువుకున్నారు. నేను నా భర్త దాదాపు 10 ఏళ్ళు దూరంగానే ఉన్నాం.. ఈ పదేళ్లలో జరగని తప్పు.. నేను మా ఆయన తిరిగి కలుసుకున్నప్పుడే ఎందుకు జరిగిందో నాకు అర్ధం కావడం లేదు.. అంటుంది దీప..

Also Read: పాకిస్థాన్‌లో ఓ వైపు కరోనా వైరస్ నాలుగో వేవ్.. భారీగా కేసులు.. మరోవైపు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించిన అధికారులు