Akashame Ni Haddura Movie: బాలీవుడ్‏లో రీమేక్ కానున్న సూర్య “ఆకాశమే నీ హద్దురా” మూవీ.. అఫీషియల్‏గా ప్రకటించిన హీరో..

ఇటీవల గత కొంత కాలంగా.. సౌత్ ఇండియన్ సినిమాలపై బాలీవుడ్ నిర్మాతల దృష్టి పడింది. దక్షిణాది సూపర్ హిట్ సినిమాలను హిందీలోకి రీమేక్ చేయడానికి మేకర్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

Akashame Ni Haddura Movie: బాలీవుడ్‏లో రీమేక్ కానున్న సూర్య ఆకాశమే నీ హద్దురా మూవీ.. అఫీషియల్‏గా ప్రకటించిన హీరో..
Akashame Ni Haddura
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 13, 2021 | 6:03 PM

ఇటీవల గత కొంత కాలంగా.. సౌత్ ఇండియన్ సినిమాలపై బాలీవుడ్ నిర్మాతల దృష్టి పడింది. దక్షిణాది సూపర్ హిట్ సినిమాలను హిందీలోకి రీమేక్ చేయడానికి మేకర్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. బీటౌన్‏లో ఇప్పుడు ఎక్కువగా సొంత స్టోరీ చిత్రాల కంటే.. ఇతర భాషల్లో బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమాలను తెరకెక్కిస్తున్నారు టాప్ డైరెక్టర్స్. ఇప్పటికే తెలుగులో సూపర్ హిట్ అయిన “అర్జున్ రెడ్డి” సినిమాను హిందీలో “కబీర్ సింగ్” పేరుతో రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు షాహిద్ కపూర్. అలాగే న్యాచురల్ స్టార్ నాని నటించిన “జెర్సీ” మూనీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో దక్షిణాది సూపర్ హిట్ చిత్రం హిందీలోకి రీమేక్ కానుంది. అదే తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన “ఆకాశమే నీ హద్దురా” మూవీ.

ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జీఆర్ గోపీనాథ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సుధ కొంగర తమిళంలో శూరరై పోట్రు పేరుతో రూపొందించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ మూవీని తెలుగులో ఆకాశమే నీ హద్దురా పేరుతో డబ్ చేయగా.. ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. 93వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్‏కు ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు సూర్య మూవీ హిందీలోకి రీమేక్ కానుంది. ఈ విషయాన్ని హీరో సూర్య తన ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. అంతేకాదు.. ఈ మూవీతో నిర్మాతగా సూర్య హిందీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. గతంలో రక్త చరిత్ర-2 వంటి సినిమాతో బాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య .. ఇప్పుడు నిర్మాతగా బీటౌన్‏లో రాణించాలనుకుంటున్నాడు. మరీ బాలీవుడ్‏లో సూర్య పాత్రలో ఎవరు నటిస్తారనేది చూడాలి.

సూర్య ట్వీట్..

Also Read: Allu Arjun: మాస్ యాక్షన్‏ ఎంటర్‏టైనర్‏గా రానున్న బన్నీ.. బోయపాటి డైరెక్షన్‏లో అల్లు అర్జున్ సినిమా ?

Boycott Pavitra Rishta 2: సుశాంత్ సింగ్ స్థానంలో మరొకరిని ఊహించుకోలేము.. ఆ సీరియల్‏ను వెంటనే ఆపేయండి.. నెట్టింట్లో సుశాంత్ ఫ్యాన్స్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?