AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pooja Bhatt: తాగుడుకు బానిసయ్యాను.. అందుకు పోరాటమే చేశా.. హీరోయిన్ పూజాభట్ సంచలన కామెంట్స్..

బాలీవుడ్ పాపులర్ నటి పూజా భట్ తాగుడుకు బానిసయ్యానని.. దాని నుంచి బయటపడేందుకు పోరాటం చేసానని చెప్పుకొచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి

Pooja Bhatt: తాగుడుకు బానిసయ్యాను.. అందుకు పోరాటమే చేశా.. హీరోయిన్ పూజాభట్ సంచలన కామెంట్స్..
Pooja Bhatt
TV9 Telugu Digital Desk
| Edited By: Rajitha Chanti|

Updated on: Jul 14, 2021 | 4:30 PM

Share

బాలీవుడ్ పాపులర్ నటి పూజా భట్ తాగుడుకు బానిసయ్యానని.. దాని నుంచి బయటపడేందుకు పోరాటం చేసానని చెప్పుకొచ్చింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా భట్.. తన జీవితంలో జరిగిన విషయాల గురించి తెలిపింది. తన తండ్రి మహేష్ భట్ దర్శకత్వంలో ఆమె నటించిన “దిల్‌ హై కీ మాన్‌తా నహీ” సినిమా జూలై 12తో 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పూజా భట్ మాట్లాడుతూ.. సినిమాతోపాటు.. తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ సినిమాలో పూజా భట్ మద్యానికి బానిసైన తండ్రిని కాపాడుకునే కూతురి పాత్రను పోషించింది. ఈ నేపథ్యంలో సినిమాలోని తన క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చింది.

మహేశ్‌భట్‌ డైరెక్షన్‌లోనే డాడీ అనే సినిమా వచ్చింది. అందులో పరిస్థితుల ప్రభావం కారణంగా తన తండ్రి మద్యానికి బానిసవుతాడని, ఆ వ్యసనం నుంచి ఆయనను బయటకు తీసుకొచ్చే కూతురి పాత్రలో తాను నటించానని పూజా తెలిపారు. ఈ సినిమాలో తన క్యారెక్టర్ మాదిరిగానే నిజ జీవితంలోనూ మద్యానికి బానిసైనట్లు వెల్లడించింది. ఈ మూవీలో విపరీతంగా మద్యం సేవించే తండ్రిని దాని నుంచి ఆయనను బయటకు పడేసే కూతురి పాత్రలో నటించానని.. కానీ నిజ జీవితంలో తనే విపరీతంగా మద్యం సేవించేదాన్ని అని తెలిపింది. అయితే నాలుగు సంవత్సరాల క్రితమే ఆ అలవాటు మానుకున్నానని.. పూర్తిగా మద్యం నుంచి బయటపడాలకున్నట్లుగా చెప్పింది. కానీ ఆ సమయంలో తన ఆలోచనలను బయటపడేయడం చాలా కష్టంగా అనిపించిందని.. మద్యం మానేయడానికి తను నిజంగా ఓ పోరాటం చేశానని చెప్పుకొచ్చింది. అయితే చాలా మంది ఆడవాళ్లు ఈ విషయం బయటకు చెప్పడానికి భయపడతారని.. కానీ ప్రతి ఒక్కరిలో ఈ సమస్య ఉంటుందని ఫూజా భట్ తెలిపింది. ఇప్పటికైనా ఆడవాళ్లు ఈ విషయంపై మహిరంగంగా మాట్లాడాలని… అలాంటివారికి స్పూర్తి నింపాడానికి ఇప్పుడు తను ఈ విషయంపై మాట్లాడాల్సి వచ్చిందన్నారు. మహేశ్‌ భట్‌ దర్శకత్వంలో వచ్చిన ‘దిల్‌ హై కీ మాన్‌తా నహీ’ మూవీ పూజ భట్‌ లీడ్‌ రోల్‌ పోషించగా.. అమీర్ ఖాన్ హీరోగా నటించారు. ఇక తండ్రి పాత్రలో అనుపమ్ ఖేర్ నటించారు.

పూజా భట్.. సడక్, జానమ్, జునూన్, హమ్ దోనో, గుణఘర్, అంగ్రాక్షక్, చాహత్, తమన్నా, బోర్డర్, జఖ్మ్ వంటి చిత్రాల్లో నటించింది. అలాగే 2004లో వచ్చిన జాబ్ అబ్రహం, ఉడితా గోస్వామి ప్రధాన పాత్రల్లో నటించిన పాప్ సినిమాకు పూజా దర్శకత్వం వహించింది. ఇటీవల విడుదలైన బాంబే బేగమ్ వెబ్ సిరీస్‏లోనూ పూజా భట్ కనిపించింది.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Pooja B (@poojab1972)

Also Read: Akashame Ni Haddura Movie: బాలీవుడ్‏లో రీమేక్ కానున్న సూర్య “ఆకాశమే నీ హద్దురా” మూవీ.. అఫీషియల్‏గా ప్రకటించిన హీరో..

Allu Arjun: మాస్ యాక్షన్‏ ఎంటర్‏టైనర్‏గా రానున్న బన్నీ.. బోయపాటి డైరెక్షన్‏లో అల్లు అర్జున్ సినిమా ?

సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం
ఈ చెక్క సాగుతో కోట్లల్లో లాభం.. కాసుల వర్షం కురిపించే వ్యాపారం