Goodbye: ఆన్‌లైన్‌లో లీకైన ‘గుడ్‌బై’ ఫస్ట్ లుక్ ఫొటో.. ఒకే ఫ్రేమ్‌లో అమితాబ్, రష్మిక..!
అమితాబ్ బచ్చన్ తాజాగా నటిస్తోన్న గుడ్‌బై సినిమా నుంచి కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో అమితాబ్‌తోపాటు రష్మిక మందన్న, నీనా గుప్తా కూడా కనిపించారు.
Amitabh Bachchan first look from Goodbye: అమితాబ్ బచ్చన్ తాజాగా నటిస్తోన్న గుడ్‌బై సినిమా నుంచి కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఇందులో అమితాబ్‌తోపాటు రష్మిక మందన్న, నీనా గుప్తా కూడా కనిపించారు. దాంతో ఇదే అదునుగా నెటిజన్లు గుడ్‌బై సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో ఈ ఫొటోను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ మేరకు అమితాబ్ రూపాన్ని ఫొటోలో చూడవచ్చు. ఇందులో అమితాబ్ ఫోన్‌లో ఏదో చూస్తున్నట్లుగా ఉంది. అలాగే ఆయనతోపాటు రష్మిక మందన్న కూడా అతృతగా ఫోన్‌ను చూస్తున్నట్లుగా ఫొటోలో కనిపించింది. అయితే షూటింగ్‌లో భాగంగా ఈ ఫొటోను తీసినట్లు తెలుస్తోంది.
ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమాలో నీనా గుప్తా, రష్మికతో కలిసి అమితాబ్ బచ్చన్ కనిపించనున్నారు. రష్మిక ఫ్యాన్స్ ఆన్‌లైన్‌లో పంచుకున్న ఈ ఫొటోలో అమితాబ్ తో పాటు రష్మిక ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఇందులో అమితాబ్ ముదురు ఆకుపచ్చ రంగు జాకెట్‌తో పాటు పింక్ చొక్కాను ధరించాడు. ఇక సౌత్ ఇండియా బ్యూటీ రష్మిక బూడిద రంగు స్లీవ్‌లెస్ టాప్‌తో కనిపించింది.
ఈ సినిమాకు వికాస్ బాహ్ల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుడ్ కో ప్రొడక్షన్ బ్యానర్‌లో నిర్మించనున్న ఈ సినిమాను బాలాజీ టెలిఫిల్మ్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. గత నెలలో గుడ్‌బై సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. షూటింగ్‌కు వెళ్తున్నట్లు అమితాబ్, నీనా గుప్తాలు తమ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమితాబ్ షేర్ చేసిన ఫొటోలో ముఖానికి మాస్క్ పెట్టుకుని తలను కూడా కవర్ చేసి కారులో ప్రయాణిస్తున్నట్లుగా ఉంది. ‘లాక్‌డౌన్ 2.0 తరువాత తొలిరోజు ఉదయం 7 గంటలకు పాంగోలిన్ మాస్క్‌తో షూటింగ్‌కు వెళ్తున్నాను’ అంటూ రాసుకొచ్చాడు అమితాబ్. అలాగే నీనా గుస్తా కూడా తిరిగి షూటింగ్‌లో జాయిన్ అయినట్లు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
అమితాబ్ బచ్చన్ గుడ్‌బై సినిమాతో పాటు ఇమ్రాన్ హస్మీ, జున్ద్ ప్రధాన పాత్రల్లో రానున్న చెహ్రే సినిమాను లైన్‌లో పెట్టారు. వీటితోపాటు అయాన్ ముఖర్జీ తొలిసారి తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీలోనూ బాలీవుడ్ బాద్‌షా కనిపించనున్నాడు. ఇందులో రన్ భీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారు.
View this post on Instagram
Also Read:
సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్ధం.. భారీ బడ్జెట్‌తో తెరపైకి.. హీరోగా ఇద్దరి పేర్లు..!