AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్ధం.. భారీ బడ్జెట్‌తో తెరపైకి.. హీరోగా ఇద్దరి పేర్లు..!

Sourav Ganguly Biopic: టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. హిందీలో తెరకెక్కనున్న ఈ సినిమాకు గంగూలీ పచ్చజెండా ఊపాడు.

సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్ధం.. భారీ బడ్జెట్‌తో తెరపైకి.. హీరోగా ఇద్దరి పేర్లు..!
Sourav Ganguly Biopic
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 13, 2021 | 5:23 PM

Share

టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు రంగం సిద్ధమైంది. హిందీలో తెరకెక్కనున్న ఈ సినిమాకు గంగూలీ పచ్చజెండా ఊపాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మూవీ యూనిట్ మునిగిపోయిందని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు రూ.200కోట్ల నుంచి రూ.250 కోట్ల బడ్జెట్‌తో గంగూలీ బయోపిక్ తీయనున్నట్లు తెలుస్తోంది. ఈమేరక బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా కన్‌ఫాం చేశాడు. ఓ మీడియాతో మాట్లాడిన ఆయన.. బయోపిక్ తీసేందుకు ఒప్పుకున్నట్లు వెల్లడించాడు. మరికొన్ని రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన అన్నారు.

సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. “బయోపిక్​తీసేందుకు ఓకే చెప్పాను. హిందీలో ఈ సినిమా తీయనున్నారు. ప్రస్తుతానికి దర్శకుడెవరనేది తెలియదు. మరికొన్ని రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయని” అన్నారు. కాగా, ఇప్పటికే దాదా బయోపిక్​కథ పూర్తయిందని బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే నిర్మాత.. సౌరవ్ గంగూలీల మధ్య అనేకసార్లు చర్చలు నడిచాయని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి. అలాగే గంగూలీ బయోపిక్‌లో హీరోగా ఎవరు నటిస్తారనే ఊహాగానాలు నడుస్తున్నాయి. హీరోగా రణ్ బీర్ కపూర్ అయితే సరిగ్గా సరిపోతాడని నెట్టింట్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు గంగూలీ కూడా ఈ బాలీవుడ్ హీరో పేరును తెరపైకి తీసుకొచ్చాడు. మరో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ పేరు కూడా దాదా బయోపిక్‌కు సెట్ అవుతాడనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికైతే హీరోల విషయంలో ఎటువంటి క్లారిటీ రాలేదు. వీరితోపాటు మరో ఇద్దరు హీరోల పేర్లు కూడా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బయోపిక్‌లో దాదా చిన్నతనం నుంచి బీసీసీఐ అధ్యక్షుడు అయ్యే వరకు జరిగిన పలు సంఘటనలను కథలో చూపించనున్నారు.

ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ దాదా జీవితంలో మెండుగా ఉన్నాయి. గంగూలీ లైఫ్​స్టైల్​నుంచి క్రికెట్ వరకు.. ఇలా అన్ని విషయాల్లోనూ పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. టీమిండియా సంక్షోభ సమయంలో ఈ బెంగాల్ టైగర్ టీమ్‌ను ముందుకు నడిపించిన తీరు ఇప్పటికీ క్రికెట్ ప్రేమికులు మర్చిపోలేరు. అలాగే నిజ జీవితంలోనూ దాదా ప్రేమ విహహం కూడా ఓ మంచి సినిమాను తలపిస్తుందనడంలో సందేహం లేదు. దాదా బయోపిక్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే సచిన్, ధోని లాంటి అగ్రశ్రేణి ప్లేయర్లపై సినిమాలు వచ్చాయి. అయితే సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్రపై ఓ డాక్యుమెంటరీ విడుదల కాగా, టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ జీవితంపై తీసిన ‘ధోని అన్ టోల్డ్ స్టోరీ’ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్… ధోనీ పాత్రలో జీవించాడు. అలాగే భారత మహిళా క్రికెటర్లు మిథాలీరాజ్, జులన్ గోస్వామి బయోపిక్​లపైనా రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:

IND vs SL: వన్డేలు, టీ20ల్లో భారత్‌పై అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన శ్రీలంక ప్లేయర్లు వీరే..!

ఐదున్నర గంటల బ్యాటింగ్‌లో 415 పరుగులు.. బౌలర్లకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా బాదేశాడు! అతనెవరో తెలుసా?