ఐదున్నర గంటల బ్యాటింగ్‌లో 415 పరుగులు.. బౌలర్లకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా బాదేశాడు! అతనెవరో తెలుసా?

అతను రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. జాతీయ జట్టులో ఆడేందుకు అవకాశం పొందలేక పోయాడు. అసాధారణ బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచాడు.

ఐదున్నర గంటల బ్యాటింగ్‌లో 415 పరుగులు.. బౌలర్లకు ఎలాంటి గౌరవం ఇవ్వకుండా బాదేశాడు! అతనెవరో తెలుసా?
England Cricketer Bill Roe
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Venkata Chari

Updated on: Jul 13, 2021 | 3:31 PM

On This Day In Cricket: అతను రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్. జాతీయ జట్టులో ఆడేందుకు అవకాశం పొందలేక పోయాడు. అసాధారణ బ్యాటింగ్‌కు మారుపేరుగా నిలిచాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్‌తో రికార్డులు నెలకొల్పాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఈ ఆటగాడు బౌలర్లకు ఎటువంటి గౌరవం ఇవ్వలేదు. అందర్నీ బాదేశాడు. అలాంటి ఆటగాడు ఎవరా అని ఆలోచిస్తున్నారా..! అతని పేరు బిల్ రో. ఈ ఆటగాడు ఇంగ్లండ్‌లో జన్మించాడు. నేడు ఆయన పుట్టిన రోజు(జులై 13న). ఐదున్నర గంటలపాటు పిచ్‌లో ఉండి, 415 పరుగులు బాదేశి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఈ చారిత్రాత్మక ప్రదర్శన 1876వ సంవత్సరంలో జరిగింది. ఇమ్మాన్యూయేల్ కళాశాల తరపున కీఎస్ కాలేజీతో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్ కేంబ్రిడ్జ్ మైదానంలో జరిగింది. ఐదున్నర గంటల పాటు బ్యాటింగ్ చేసిన బిల్ రో.. 415 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సిక్స్, 16 ఫోర్లు ఉన్నాయి. అలాగే 48 ట్రిపులస్, 52 డబుల్స్, 67 సింగిల్స్‌తోపాటు ఒకసారి 5 పరుగులు కూడా తీశాడు. ఆ సమయంలో బిల్ రో చేసిన ఈ స్కోర్.. అత్యధిక స్కోర్‌గా నమోదైంది. చాలాకాలం పాటు ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.

83 మ్యాచుల్లో 4 సెంచరీలు, 2690 పరుగులు, 32 వికెట్లు బిల్ రోవ్‌కు ఇంగ్లండ్ తరపున ఆడే అవకాశం రాలేదు. కానీ, ఫస్ట్ క్లాస్‌ మ్యాచులను మాత్రం చాలానే ఆడాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ తన కెరీర్‌లో మొత్తం 83 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో బరిలోకి దిగాడు. ఇందులో అతను 141 ఇన్నింగ్స్‌లలో 20.22 సగటుతో 2690 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 8సార్లు అజేయంగా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోర్ 132 పరుగులు. ఇందులో నాలు సెంచరీలు నమోదు చేశాడు. అలాగే 35 క్యాచులు అందుకున్నాడు. బిల్‌రో బ్యాటింగ్‌లోనే కాదు.. బౌలింగ్‌లోనూ సత్తా చాటాడు. 83 ఫస్ట్ క్లాస్‌ మ్యాచుల్లో 32 వికెట్లు సాధించాడు. ఓ మ్యాచ్‌లో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

Also Read:

ఈ ఆటగాడు మరో 8 పరుగులు చేసుంటే.. ధోనిసేనకు ఘోర పరాజయమే మిగిలేది.. డే అండ్ నైట్ టెస్టుల్లో తొలి సెంచరీ చేసింది ఇతనే..!

Yashpal Sharma: టీమిండియా మాజీ క్రికెటర్​ యశ్​పాల్​ కన్నుమూత.. భావోద్వేగానికి గురైన భారత క్రికెటర్లు

ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!