- Telugu News Sports News Cricket news Happy birthday faf du plessis south africa and chennai super kings batsmen birthday on this day
ఈ ఆటగాడు మరో 8 పరుగులు చేసుంటే.. ధోనిసేనకు ఘోర పరాజయమే మిగిలేది.. డే అండ్ నైట్ టెస్టుల్లో తొలి సెంచరీ చేసింది ఇతనే..!
అతను ఏబీ డివిలియర్స్ క్లాస్‌మేట్. ఐపీఎల్‌కు వచ్చినప్పుడు స్పిన్నర్‌గా బరిలోకి దిగాడు. కానీ, అతని బ్యాటింగ్ కారణంగా బాగా ఫేమస్ అయ్యాడు.
Updated on: Jul 13, 2021 | 2:55 PM

అతను ఏబీ డివిలియర్స్ క్లాస్‌మేట్. ఐపీఎల్‌కు వచ్చినప్పుడు స్పిన్నర్‌గా బరిలోకి దిగాడు. కానీ, అతని బ్యాటింగ్ కారణంగా బాగా ఫేమస్ అయ్యాడు. 2011 నుంచి మహేంద్ర సింగ్ ధోనీ టీం చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక బ్యాట్స్‌మెన్‌గా మారిపోయాడు. అలాగే అతను తన దేశంలో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్లలో ఒకడిగా పేరుగాంచాడు. నేడు డుప్లెసిస్ పుట్టినరోజు. దక్షిణాఫ్రికా టీంలో బలమైన బ్యాట్స్‌మెన్‌గా ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలోనూ సారథిగా వ్యవహరించాడు.

ఫాఫ్‌డు ప్లెసిస్.. ఏబీ డివిలియర్స్ ఇద్దరూ క్లాస్‌మేట్స్. చదువు మధ్యలో ఆపేసిన డుప్లెసిస్.. ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడడం ప్రారంభించాడు. లాంక్షైర్‌తో కలిసి మ్యాచ్‌లు ఆడాడు. అనంతరం జనవరి 2011లో టీమిండియాతో జరిగిన వన్డే క్రికెట్‌తో అంతర్జాతీయంగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి మ్యాచ్‌లోనే 60 పరుగులు చేశాడు. అనంతరం 2011లో జరిగిన ప్రపంచకప్‌లో ఆడాడు. కానీ, తన తొలి వన్డే సెంచరీ కోసం దాదాపు 51 మ్యాచ్‌ల వరకు ఆగాల్సి వచ్చింది. 149 వన్డేల్లో 47.47 సగటుతో 5507 పరుగులు సాధించాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఫాఫ్ డుప్లెసిస్ 2012 ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ చేశాడు. టెస్ట్ అరంగేట్రంలోని సెంచరీ చేసిన నాలుగో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన డుప్లెసిస్.. 376 బంతుల్లో 110 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికా టీంను ఓటమి నుంచి కాపాడింది. ఫాఫ్ డు ప్లెసిస్ సుమారుగా ఎనిమిది గంటలు బ్యాటింగ్ చేశాడు. 2013 డిసెంబర్‌లో భారత్‌తో జరిగిన టెస్టులో కూడా అద్భుతాలు చేశాడు. జోహన్స్‌బర్గ్ టెస్టులో మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని టీమిండియా 458 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ 309 బంతుల్లో 134 పరుగులు చేశాడు. ఏబీ డివిలియర్స్‌తో కలిసి జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు. అనంతరం డుప్లెసిస్ ఔట్ కావడంతో.. దక్షిణాఫ్రికా టీం 450 పరుగులు మాత్రమే చేయగలిగింది. డే అండ్ నైట్ టెస్టులో తొలి సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. 69 టెస్టుల్లో 40 సగటుతో 4163 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు ఉన్నాయి.

ఫాఫ్ డుప్లెసిస్‌కు చొక్కా లేకుండా ప్రయాణించడమంటే చాలా ఇష్టం. చెన్నై సూపర్ కింగ్స్‌లో డుప్లెసిస్ సహచరుడు బ్రెండన్ మెకల్లమ్ ఓసారి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లగానే, డుప్లెసిస్ చొక్కా లేకుండా నడుస్తూ ఉన్నట్లు పేర్కొన్న సంగతి తెలిసిందే. డుప్లెసిస్ మొదటి నుంచి ఇలానే ఉన్నాడు. పాఠశాల రోజుల్లోనూ ఒంటిపై చొక్కా లేకుండా తిరుగుతుండేవాడు.

ఫాఫ్ డుప్లెసిస్ 2011 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగమయ్యాడు. కానీ, అతన్ని జట్టులోకి తీసుకున్నప్పుడు లెగ్ స్పిన్నర్‌గా ఉండేవాడు. అతని పేరుమీద టీ20లో 50 వికెట్లు ఉన్నాయి. కానీ, సీఎస్కేలో చేరిన తరువాత అతను బౌలింగ్ చేయలేదు. స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌గా మారాడు. సీఎస్కే విజయంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించాడు. కెప్టెన్ ధోనికి డుప్లెసిస్‌పై చాలా నమ్మకం ఉండేది. డుప్లిసిస్ పేరుతో చాలా రికార్డులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది జీరో పరుగుల వద్ద ఒక్కసారి కూడా ఔట్ కాకపోవడం. 108 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తర్వాత తొలిసారిగా డుప్లిసిస్ సున్నా పరుగుల వద్ద ఔటయ్యాడు. తిలకరత్నే దిల్షాన్ తరువాత మూడు ఫార్మెట్లలో సెంచరీ సాధించిన రెండవ కెప్టెన్‌గా డుప్లెసిస్ నిలిచాడు. మూడు ఫార్మెట్లలోనూ సెంచరీ చేసిన మొట్టమొదటి దక్షిణాఫ్రికా క్రికెటర్, అలాగే ఆస్ట్రేలియాతో స్వదేశంతోపాటు విదేశంలోనూ టెస్టు సిరీస్ గెలిచిన మొదటి కెప్టెన్‌గా రికార్డులు నెలకొల్పాడు.



