టీమిండియాను గట్టి దెబ్బ తీశాడు.. అదరగొట్టే డబుల్ సెంచరీతో విజయాన్ని అందించాడు.. అతడెవరంటే.!
క్రికెట్‌లో ప్రతీసారి ఎన్నో ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు గెలవాల్సిన టీమ్ ఓడిపోతే.. మరికొన్ని సార్లు ఓడిపోవాల్సిన..
క్రికెట్‌లో ప్రతీసారి ఎన్నో ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు గెలవాల్సిన టీమ్ ఓడిపోతే.. మరికొన్ని సార్లు ఓడిపోవాల్సిన టీమ్ అనూహ్యంగా విజయం సాధిస్తుంది. ఇక్కడ ఓ బ్యాట్స్‌మెన్ టీమిండియాను ఘోరంగా దెబ్బతీశాడు. గెలవాల్సిన మ్యాచ్‌ను తన్నుకుపోయాడు. అద్భుతమైన డబుల్ సెంచరీతో తన జట్టుకు అపూర్వ విజయాన్ని అందించాడు. అతడెవరో కాదు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ గోవర్. 1979వ సంవత్సరం జూలై 12న ఇంగ్లాండ్, భారత్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో గోవర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఐదు వికెట్లు నష్టపోయి 633 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. డేవిడ్ గోవర్ 279 బంతుల్లో 200 పరుగులు చేసి అదరగొట్టాడు. అలాగే ఓపెనర్ జియోఫ్ బాయ్‌కాట్ 155 పరుగులు, మరో రెండు అర్ధ సెంచరీలు తోడవ్వడంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించగలిగింది. అటు భారత బౌలర్లలో కపిల్ దేవ్ ఐదు వికెట్లు తీశాడు.
ఫాలో-ఆన్ ఆడిన టీమిండియా…
మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 297 పరుగులకు ఆలౌట్ అయింది. గుండప్ప విశ్వనాథ్ 78, సునీల్ గవాస్కర్ 61 మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బాబ్ విల్లిస్ మూడు వికెట్లు తీయగా, ఇయాన్ బోథమ్, మైక్ హెండ్రిక్స్, ఫిల్ ఎడ్మండ్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. దీనితో టీమిండియా ఫాలో-ఆన్ ఆడాల్సి వచ్చింది.
రెండో ఇన్నింగ్స్‌లో కూడా టీమిండియా కేవలం 253 పరుగులు మాత్రమే చేయగలిగింది. సునీల్ గవాస్కర్ అత్యధికంగా 68 పరుగులు చేయగా, చేతన్ చౌహాన్ 56 పరుగులు చేశాడు. మరోవైపు గుండప్ప విశ్వనాథ్ 51 పరుగులు రాబట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఇయాన్ బోథమ్ ఐదు వికెట్లు తీయగా, మైక్ హెండ్రిక్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీనితో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 83 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. డేవిడ్ గోవర్ తన అద్భుతమైన డబుల్ సెంచరీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
Also Read:
ఈ ఫోటోలో చిరుత నక్కింది.. గుర్తించండి చూద్దాం.. చాలామంది ఫెయిల్ అయ్యారు!
కోళ్ల వెంటబడ్డ పాము.. గోరింక మెరుపు దాడి.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!
10 పరుగులిచ్చి 10 వికెట్లు.. అందులో ఓ హ్యాట్రిక్.. టెస్టుల్లో అరుదైన రికార్డు.. ఆ బౌలర్ ఎవరంటే.!
కళ్లను మాయ చేసే ఫోటో.. బల్లిని గుర్తించండి చూద్దాం.. అస్సలు ఫెయిల్ కాకూడదు.!