AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Pic: ఈ మాస్క్‌తో ఉన్న హీరోయిన్‏ను గుర్తు పట్టగలరా.? ఈమె ఓ స్టార్ డైరెక్టర్ భార్య.. కనిపెట్టండి చూద్దాం..

అందం సైతం అసూయ పడేలా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ? అందమైన కళ్లతో.. ఎర్రని సిందూరంతో.. అందమైన మాస్క్ ధరించి మరీ సెల్ఫీకి ఫోజిచ్చింది ఈ అమ్మడు.

Viral Pic: ఈ మాస్క్‌తో ఉన్న  హీరోయిన్‏ను గుర్తు పట్టగలరా.? ఈమె ఓ స్టార్ డైరెక్టర్ భార్య.. కనిపెట్టండి చూద్దాం..
Actress
TV9 Telugu Digital Desk
| Edited By: Rajitha Chanti|

Updated on: Jul 13, 2021 | 7:12 PM

Share

అందం సైతం అసూయ పడేలా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ? అందమైన కళ్లతో.. ఎర్రని సిందూరంతో.. అందమైన మాస్క్ ధరించి మరీ సెల్ఫీకి ఫోజిచ్చింది ఈ అమ్మడు. “కలియుగ పాండవులు” సినిమాతో టాలీవుడ్‏లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ హీరోయిన్ తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్‏గా చక్రం తిప్పింది. తొలి సినిమాతోనే విక్టరి వెంకటేష్‏తో నటించే అవకాశాన్ని అందుకుంది. ఆ తర్వాత.. చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లను అందుకుంటూ.. దక్షిణాది స్టార్ హీరోయిన్‏గా స్థానం సొంతం చేసుకుంది. ఆమెను ఎంతగానో ఆరాధించే అభిమానులు ఆమె కోసం ఏకంగా గుడి కూడా కట్టించారు. ఇంతకీ ఇప్పుడైనా గుర్తుపట్టారా ? ఆ హీరోయిన్ ఎవరనేది. ఎంటీ ఇంకా గుర్తుపట్టలేదా ?

టాలీవుడ్‏లో అగ్రహీరోలందరితో స్క్రీన్ చేసుకుని.. తనకంటూ ఓ స్పెషల్ ఇమెజ్ సొంతం చేసుకుంది ఖుష్బు. తాజాగా ఈ హీరోయిన్ మాస్క్ పెట్టుకుని అందంగా సెల్ఫీకి ఫోజిచ్చింది. తమిళనాడులో గుడి కలిగిన తొలి హీరోయిన్‏గా ఖుష్బూ రికార్డు సాధించింది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ అగ్రహీరో వెంకటేష్ సరసన నటించే అవకాశాన్ని అందుకుని.. తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ఖుష్బూ టాలీవుడ్‏లో వరుస ఆఫర్లను అందుకుంటూ.. టాప్ హీరోయిన్స్‏కు పోటీగా నిలిచింది. హీరోయిన్‏గానే కాకుండా.. ఖుష్బూ తర్వాతి కాలంలో సొదరిగా… వదినగా ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్‏గానూ నటించి మెప్పించింది. సినిమాల్లో కొనసాగుతూనే.. తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఖుష్బూ. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి అనూహ్యంగా ఓడిపోయింది.

ట్వీట్..

Also Read: Vijay Thalapathy: తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతికి షాకిచ్చిన హైకోర్టు.. భారీగా జరిమానా విధిస్తూ ఆదేశాలు..

Nikhil Siddharth: పెట్రోల్ ధరలపై హీరో నిఖిల్ రియాక్ట్.. ఇబ్బందిపడుతున్న ప్రతి ఒక్కరి తరపున నా రిక్వెస్ట్ అంటూ ట్వీట్..

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ