AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil Siddharth: పెట్రోల్ ధరలపై హీరో నిఖిల్ రియాక్ట్.. ఇబ్బందిపడుతున్న ప్రతి ఒక్కరి తరపున నా రిక్వెస్ట్ అంటూ ట్వీట్..

Nikhil Siddharth:  ప్రస్తుతం దేశం మొత్తం కరోనాతో పోరాడుతుంటే.. మరోవైపు సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. అటు నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోవడం..

Nikhil Siddharth: పెట్రోల్ ధరలపై హీరో నిఖిల్ రియాక్ట్.. ఇబ్బందిపడుతున్న ప్రతి ఒక్కరి తరపున నా రిక్వెస్ట్ అంటూ ట్వీట్..
Siddharth Nikhil
TV9 Telugu Digital Desk
| Edited By: Rajitha Chanti|

Updated on: Jul 13, 2021 | 2:46 PM

Share

Nikhil Siddharth:  ప్రస్తుతం దేశం మొత్తం కరోనాతో పోరాడుతుంటే.. మరోవైపు సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. అటు నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోవడం.. ఆసుపత్రి ఖర్చులతో సతమతమవుతున్న ప్రజలకు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు మరింత భారాన్ని మోపుతున్నాయి. కరోనా ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయి.. వ్యాపారాలు దెబ్బతిన్న వారికి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇక గత కొద్ది రోజులుగా లీటర్ పెట్రోల్ రూ.100 పెరిగి వినియోగదారులకు పగటి చుక్కలు చూపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా.. ప్రజలు, ప్రతిపక్షాలు ఎంత నిరసన తెలిపిన ధరలు మాత్రం తగ్గడం లేదు.

ఇటీవల పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా కొందరు తమ వాహనాలను రోడ్లపైనే వదిలేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పెట్రోల్, డీజిల్ ధరలపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వం ట్యాక్సులను రద్ధు చేయాలని నిఖిల్ అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో.. అసలు ఏం జరుగుతుంది. రూ. 35 ఉండాల్సిన పెట్రోల్/డీజిల్ ధర పంపు వద్ద మాత్రం రూ.100గా ఉంటుంది. ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రబుత్వాలు విధించే ట్యాక్సులను వెంటనే రద్ధు చేయాలి. ఈ ధరల పెంపువలన ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి తరపున ఇది నా రిక్వెస్ట్… అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. అందుకు అతను ఓ ఫోటో కూడా షేర్ చేశారు. అందులో చెట్టుకి ఉన్న పండు అందక ఎదురుచూస్తున్న వ్యక్తిగ ఈ ఫోటోను చూస్తే అర్థమవుతుంది. ఇక పెట్రలో, డీజిల్ ధరలపై ప్రభుత్వాలు మరోసారి సమీక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.

నిఖిల్ ట్వీట్..

Also Read: Ram Gopal Varma: వర్మ-నాగార్జున సినిమాపై సిరా శ్రీ కామెంట్.. రచయిత మాటల గారడీకి దండం పెట్టిన ఆర్జీవి..

Shruti Haasan: బాయ్‏ఫ్రెండ్‏తో కలిసి వంటగదిలో శ్రుతిహాసన్ రచ్చ.. కలిసి తినేవారే కలిసుంటారు అంటూ..

Ariyana Glory: నువ్వు ప్రేమలో ఉన్నావా ? ఆసక్తికర సమాధానమిచ్చిన అరియానా.. ఇప్పుడే ఎక్కువ ఇష్టమంటూ..