Suvarna Sundari OTT: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన పూర్ణ సువర్ణ సుందరి.. ఎక్కడ చూడొచ్చంటే?
ప్రముఖ నటి పూర్ణ, అలనాటి అందాల తార జయప్రద, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సువర్ణ సుందరి'. సురేంద్ర మాదారపు ఈ సూపర్ న్యాచురల్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ కు దర్శకత్వం వహించారు. సాయికుమార్, రామ్, ఇంద్ర, నాగినీడు, కోట శ్రీనివాసరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. జయప్రద చాలా రోజుల తర్వాత నటించడం

ప్రముఖ నటి పూర్ణ, అలనాటి అందాల తార జయప్రద, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సువర్ణ సుందరి’. సురేంద్ర మాదారపు ఈ సూపర్ న్యాచురల్ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ కు దర్శకత్వం వహించారు. సాయికుమార్, రామ్, ఇంద్ర, నాగినీడు, కోట శ్రీనివాసరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. జయప్రద చాలా రోజుల తర్వాత నటించడం, టీజర్స్, పోస్టర్స్, ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండడంతో సువర్ణ సుందరి సినిమాపై హైప్ పెరిగింది. అయితే గతేడాది ఫిబ్రవరి 3వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. భారీ స్టార్ క్యాస్టింగ్ ఉన్నా యావరేజ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. అయితే పూర్ణ, జయప్రద నటనకు మంచి పేరొచ్చింది. అలాగే వీఎఫ్ఎక్స్ కూడా బాగున్నాయని ప్రశంసలు వచ్చాయి. థియేటర్లలో యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న సువర్ణ సుందరి డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన సుమారు ఏడాది తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రస్తుతం సువర్ణ సుందరి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. అది కూడా కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్..
ఇదిలా ఉంటే ఇటీవల కొన్ని ఓటీటీ సంస్థలు తమ సబ్ స్క్రైబర్లకు కూడా రెంటల్ పద్ధతిని అవలంభిస్తున్నాయి. ఇప్పుడు స్ట్రీమింగ్ కు వచ్చిన సువర్ణ సుందరి సినిమా కూడా చూడాలంటే రూ.79లు కట్టాల్సిందే. అయితే త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‍స్క్రైబర్లందరికీ ఉచితంగా స్ట్రీమింగ్‍కు అందుబాటులో వచ్చే అవకాశముంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. త్రినేత్రి అనే విగ్రహం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. 15, 18, 19వ శతాబ్ధం, ప్రస్తుత కాలం.. ఇలా మొత్తం నాలుగు టైమ్ లేన్లలో ఈ మూవీ సాగుతుంది. ఇక పూర్ణ ఇటీవల మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో స్పెషల్ సాంగ్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే.
అమెజాన్ ప్రైమ్ లో సువర్ణ సుందరి స్ట్రీమింగ్..
#MeanGirlz @thisisavantika in #suvarnasundari 2023 pic.twitter.com/ABCyPjy2dJ
— Mohan_The_King 👑 (@Mohan_TheKing) March 12, 2024
గుంటూరు కారం సినిమాలో పూర్ణ స్టెప్పులు..
Em grace raanivo nv @shamna_kkasim , mari maa manasulani antha chestunnav kirikiri.#WomenCrushWednesday #GeminiTV #ComeHomeToGemini #Poorna pic.twitter.com/EynHdSaZUq
— Gemini TV (@GeminiTV) February 7, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








