AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

True Lover OTT: ‘ట్రూ లవర్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో ట్రూ లవర్ పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ మారుతి.. బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇందులో గౌరిప్రియ కథానాయికగా నటించింది. మ్యాడ్ , రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో మెప్పించిన తెలుగమ్మాయి గౌరిప్రియ అటు తమిళంలో నటించిన సినిమా ఇదే. ఇక థియేటర్లలో మెప్పించిన ట్రూ లవర్ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

True Lover OTT: 'ట్రూ లవర్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
True Lover
Rajitha Chanti
|

Updated on: Mar 13, 2024 | 9:14 AM

Share

గుడ్ నైట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో మణికందన్. అప్పటివరకు తమిళంలో చిన్న చిన్న పాత్రలు పోషించిన అతడికి ఈ సినిమాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. రోజూవారీ జీవితంలోని చిన్న సమస్య గురకను ప్రధాన అంశంగా తీసుకుని రూపొందించిన ఈ మూవీ గతేడాది సూపర్ హిట్ అయ్యింది. దీంతో మణికందన్ కు హీరోగా ఆఫర్స్ వస్తున్నాయి. గుడ్ నైట్ తర్వాత అతడు నటించిన లేటేస్ట్ సినిమా లవర్. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో ట్రూ లవర్ పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీకి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ మారుతి.. బేబీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ తెలుగులో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఇందులో గౌరిప్రియ కథానాయికగా నటించింది. మ్యాడ్ , రైటర్ పద్మభూషణ్ చిత్రాలతో మెప్పించిన తెలుగమ్మాయి గౌరిప్రియ అటు తమిళంలో నటించిన సినిమా ఇదే. ఇక థియేటర్లలో మెప్పించిన ట్రూ లవర్ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చి 27న స్ట్రీమింగ్ కానుంది. తమిళం, తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ లవ్ స్టోరీకి ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించారు. ట్రూలవర్ సినిమా తెలుగులో విడుదలయ్యే సమయానికి రవితేజ నటించిన ఈగల్ మూవీ కూడా రిలీజ్ అయ్యింది. దీంతో ట్రూలవర్ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది.

ట్రూలవర్ కథ విషయానికి వస్తే.. ప్రేమ విషంయోల యువతరం ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయనే అంశంపై ఈ సినిమాను రూపొందించారు. ఇందులో అరుణ్ (మణికందన్), దివ్య (శ్రీగౌరిప్రియ) ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ అరుణ్ ప్రతి విషయంలో దివ్య ను అనుమానిస్తుంటాడు. ఆమె మరొకరితో చనువుగా మాట్లాడినా సహించలేడు. అరుణ్ ప్రవర్తనతో విసిగిపోయిన దివ్య అతడికి బ్రేకప్ చెప్పాలనుకుంటుంది. కానీ అతడు క్షమాపణలు చెప్పగానే కరిగిపోతుంది. తన స్నేహితులతో కలిసి టూర్ వెళ్లిన దివ్య వెంటే అరుణ్ కూడా వెళ్తాడు. అక్కడ ఎదురైన పరిస్థితుల కారణంగా అరుణ్ ప్రవర్తనలో మార్పు వచ్చిందా ?.. దివ్య ప్రేమను అర్థం చేసుకున్నాడా ? వీరిద్దరి ప్రేమకథలో ఎలాంటి పరిస్థితులు వచ్చాయి అనేది ట్రూ లవర్ మూవీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.