Aattam OTT: ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఈ మలయాళీ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే..
వైవిధ్యమైన కథనం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ కేవలం మలయాళం భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉండడంతో ఇటు తెలుగు అడియన్స్ ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

కొన్నాళ్లుగా మలయాళీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాలుగా వచ్చి అడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. కేవలం మలయాళీ ప్రేక్షకులనే కాకుండా టాలీవుడ్, కోలీవుడ్ మూవీ లవర్స్‌ను మెప్పిస్తున్నాయి. లవ్, కామెడీ కాకుండా ఇటీవల హారర్ కంటెంట్ చిత్రాలు చూసేందుకు అడియన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మలయాళం హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. అందులో ఆట్టం ఒకటి. గతేడాది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న సినిమా ఇది. వైవిధ్యమైన కథనం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ కేవలం మలయాళం భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉండడంతో ఇటు తెలుగు అడియన్స్ ఈ మూవీని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆనంద్ ఎకర్షి దర్శకత్వం వహించిన ఈ మూవీలో జరీన్ షిహాబ్, కళాభవన్ షాజోన్, నందిని గోపాలకృష్ణన్‌లు కీలకపాత్రలు పోషించారు. దర్శకుడు స్వయంగా స్క్రీన్‌ప్లే రాశారు. బాసిల్ సీజే సంగీతం అందించగా.. జాయ్ మూవీ ప్రొడక్షన్స్ పతాకంపై అజిత్ జాయ్ నిర్మించారు. ఆటం ఖచ్చితంగా ఒక భావోద్వేగ ప్రయాణం. ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చినా.. అంతగా కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. కానీ మలయాళంలో ఆల్ టైమ్ స్పెషల్ సినిమాగా గుర్తింపు తెచ్చుకుందనే కామెంట్స్ వచ్చాయి. అలాగే అట్టం సినిమాకు పనిచేసిన వారిలో ఎక్కువ మంది థియేటర్ బ్యాక్ గ్రౌండ్ వారే కావడం విశేషం. అట్టం స్నేహం నేపథ్యంలో రూపొందిన సినిమా.
కథ విషయానికి వస్తే.. అరంగు థియేటర్ గ్రూప్‌లోని పద్నాలుగు మంది సభ్యులలో ఏకైక మహిళా కళాకారిణి అంజలి. ఆమె ఆర్కిటెక్ట్. పదహారేళ్ల వయసు నుంచి ట్రూప్‌లో సభ్యురాలిగా ఉన్న అంజలిపై లైంగిక దాడి జరుగుతుంది. దీంతో వారి గ్రూపులో విభేదాలు వస్తాయి. ఆ తర్వాత అంజలి తన గ్రూపు వదిలి తన ప్రేమికుడు సహోద్యోగి వినయ్ వద్దకు వెళ్లిపోతుంది. అతడు పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ నిందితుడిపై చర్య తీసుకోవడానికి ఆమెను ఒప్పి్స్తాడు. అరంగు గ్రూపుకు లీడర్ అయ్యేందుకు వినయ్ చర్యలు చేపడతాడు. అంజలిపై లైంగిక దాడి చేసింది ఎవరు? .. విడిపోయిన గ్రూపు మళ్లీ కలుసుకున్నారా ?.. అనేది ఆట్టం. ఈ మూవీ మొత్తం స్నేహం గురించి ఉంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




