AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barbie OTT:  ఆస్కార్ విన్నింగ్ మూవీ ‘బార్బీ’ ఇప్పుడు తెలుగులో.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

గతేడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో బార్బీ కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సూపర్ హిట్ సినిమాకు రూ. 11 వేల కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని ట్రేడ్ నిపుణుల అంచనా. ఒక్క ఇండియాలోనే బార్బీ మూవీకి సుమారు రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక 96వ ఆస్కార్ అకాడమీ అవార్డుల్లో బార్బీ సినిమా ఏకంగా ఎనిమిది నామినేష‌న్లను ద‌క్కించుకుంది

Barbie OTT:  ఆస్కార్ విన్నింగ్ మూవీ 'బార్బీ' ఇప్పుడు తెలుగులో.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Barbie Movie
Basha Shek
|

Updated on: May 04, 2024 | 4:38 PM

Share

గతేడాది హాలీవుడ్ లో ఓపెన్ హైమర్ కు పోటీగా రిలీజై సంచలనాలు సృష్టించిన చిత్రం బార్బీ. జులై 21న ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. గతేడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాల్లో బార్బీ కూడా ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ఈ సూపర్ హిట్ సినిమాకు రూ. 11 వేల కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయని ట్రేడ్ నిపుణుల అంచనా. ఒక్క ఇండియాలోనే బార్బీ మూవీకి సుమారు రూ. 150 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇక 96వ ఆస్కార్ అకాడమీ అవార్డుల్లో బార్బీ సినిమా ఏకంగా ఎనిమిది నామినేష‌న్లను ద‌క్కించుకుంది. బెస్ట్ పిక్చ‌ర్‌, ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు, స‌హాయ‌న‌టి, కాస్ట్యూమ్ డిజైన్‌, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లేతో పాటు మ‌రికొన్ని విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. అయితే కేవలం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో మాత్రమే ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వరించింది. ఇలా ఎన్నో విశేషాలున్న బార్బీ సినిమా ఇప్పుడు తెలుగులోనూ చూడొచ్చు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో బార్బీ సినిమా తెలుగు వెర్షన్ తో పాటు తమిళ్ ఆడియోలో ఆస్కార్ విన్నింగ్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

గ్రేటా గెర్విగ్ తెరకెక్కించిన బార్బీ సినిమాలో మార్గోట్ రాబీ, ర్యాన్ గోస్లింగ్, కేట్ మెక్ కిన్నన్, విల్ ఫెర్రెల్, అమెరికా ఫెరెరా, ఇస్సా రే, సిము లియులు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. బార్బీ, కెన్ అనుకోకుండా కొన్ని స‌మ‌స్య‌ల కార‌ణంగా బార్బీ వ‌ర‌ల్డ్ నుంచి రియ‌ల్‌ వ‌ర‌ల్డ్ లోకి వ‌స్తారు. ఇక్కడ వారికి ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి? బార్బీ, కెన్ ల ప్రేమకథ ఏమైంది? బార్బీ బొమ్మ‌ల‌ను త‌యారు చేసే మెట‌ల్ సీఈవో కార‌ణంగా బార్బీకి ఎలాంటి క‌ష్టాలు ఎదుర‌య్యాయి? బార్బీ వ‌ర‌ల్డ్ లో లేడీస్ డామినేష‌న్‌లో కెన్ ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడన్న‌దే బార్బీ సినిమా క‌థ‌. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? మరెందుకు లేటు వీకెండ్ లో చూసి బాగా ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

జియో సినిమాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.