AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఓటీటీలోకి ఆసక్తికర మూవీ ‘లైన్‌ మ్యాన్‌’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

లైన్ మ్యాన్ సినిమా ఓ పల్లెటూళ్ళో కరెంట్ లైన్ మ్యాన్, వందేళ్ల ఓ బామ్మ చుట్టూ తిరుగుతూ ఊళ్ళో కొన్ని రోజులు కరెంట్ లేకుండా ఎందుకు బతికారు అనే ఓ ఎమోషనల్ పాయింట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా థియేటర్లలో ఓ మాదిరిగా ఆడింది. తాజాగా తెలుగు వెర్షన్ ఓటీటీలోకి వచ్చింది.

Tollywood: ఓటీటీలోకి ఆసక్తికర మూవీ ‘లైన్‌ మ్యాన్‌’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?
Lineman Movie
Ram Naramaneni
|

Updated on: May 03, 2024 | 8:26 PM

Share

ఈ మధ్య విభిన్న కంటెంట్ చిత్రాలను జనాలు బాగా ఆదరిస్తున్నారు. కథలో కొత్తదనం ఉంటే.. ఏ భాష సినిమా అయినా ఎంకరేజ్ చేస్తున్నారు. అందుకే మేకర్స్ ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్లుగా సినిమాలను తీసుకొస్తున్నారు. ఆ కోవకు చెందిన చిత్రమే ‘లైన్‌ మ్యాన్‌’. వి.రఘుశాస్త్రి  డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో త్రిగుణ్ హీరోగా నటించాడు. పర్పుల్‌ రాక్‌ ఎంటర్‌టైనర్స్‌ సంస్థ ప్రొడ్యస్ చేసిన ఈ సినిమాలో కాజల్‌ కుందెర్‌ హీరోయిన్. తెలుగు, కన్నడ భాషల్లో మార్చిలో రిలీజై.. మంచి టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చింది. కన్నడ వెర్షన్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. తాజాగా తెలుగులోనూ సందడి చేస్తోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ప్రైమ్ వీడియోలో మీరు ఈ సినిమాని చూడొచ్చు.

సినిమా కథ విషయానికి వస్తే..  ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో లైన్ మేన్‌గా పనిచేస్తున్న తండ్రి సడెన్‌గా మరణించడంతో ఆ ఉద్యోగం నటరాజు అలియాస్ నట్టు (త్రిగుణ్)కి వస్తుంది. ఇక ఆ గ్రామంలో కరెంట్ పోవాలన్నా, రావాలన్నా అంతా నటరాజు చేతిలోనే ఉంటుంది.  ఆ ఊర్లో.. అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ ఆ గ్రామ దేవతగా దేవుడమ్మ(బి.జయశ్రీ) ఉంటుంది. ఆమెకు 99 సంవత్సరాలు నిండి 100వ పడిలోకి అడుగు పెడుతుండటంతో పుట్టిన రోజు వేడుకను చేయాలనుకుంటారు. అదే సమయానికి నట్టు పవర్ ఇవ్వను అని మొండికేస్తాడు. అసలు ఈ పుట్టినరోజు ఆలోచన చెప్పిన నట్టునే అలా కరెంట్ ఇవ్వను అనడంతో గ్రామస్థులు ఆశ్చర్యపోతారు. నట్టు ఎందుకు పవర్ ఇవ్వనన్నాడు? దానికి దేవుడమ్మ, గ్రామస్థుల రియాక్షన్ ఏంటి? అన్నది మూవీ కథ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వచ్చుడు చావబాదుడు.. ఈసారి ఐపీఎల్ వేలంలో వీళ్లకు జాక్‌పాట్ పక్కా
వచ్చుడు చావబాదుడు.. ఈసారి ఐపీఎల్ వేలంలో వీళ్లకు జాక్‌పాట్ పక్కా
బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.?
బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.?
6 ఏళ్ల ప్రేమ.. ఇద్దరు పిల్లలు.. టాలీవుడ్ హీరోయిన్‌తో విలన్ పెళ్లి
6 ఏళ్ల ప్రేమ.. ఇద్దరు పిల్లలు.. టాలీవుడ్ హీరోయిన్‌తో విలన్ పెళ్లి
RBI బిగ్‌ అలర్ట్‌.. ఇక ప్రతి మూడు నెలలకు.. కొత్త ఏడాదిలో మార్పులు
RBI బిగ్‌ అలర్ట్‌.. ఇక ప్రతి మూడు నెలలకు.. కొత్త ఏడాదిలో మార్పులు
హైదరాబాదీస్ జాగ్రత్త.! ఈసారి న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలివే..
హైదరాబాదీస్ జాగ్రత్త.! ఈసారి న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలివే..
మరికొన్ని గంటల్లో క్లాట్‌ 2026 పరీక్ష ఫలితాలు విడుదల.. లింక్‌ ఇదే
మరికొన్ని గంటల్లో క్లాట్‌ 2026 పరీక్ష ఫలితాలు విడుదల.. లింక్‌ ఇదే
పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌..!
పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌..!
ఈ లావాదేవీలు చేస్తే భార్యాభర్తలకు కూడా నోటీసులు.. అవేంటో తెలుసా?
ఈ లావాదేవీలు చేస్తే భార్యాభర్తలకు కూడా నోటీసులు.. అవేంటో తెలుసా?
నోటి దర్వాసనకు మీ ఇంట్లోనే అద్భుత పరిష్కారాలు.. ఇలా చేస్తే..
నోటి దర్వాసనకు మీ ఇంట్లోనే అద్భుత పరిష్కారాలు.. ఇలా చేస్తే..
తెల్లవారుజామున దారుణం.. 4 బస్సుల్లో ప్రయాణికుల సజీవ దహనం! వీడియో
తెల్లవారుజామున దారుణం.. 4 బస్సుల్లో ప్రయాణికుల సజీవ దహనం! వీడియో