Manjummel Boys OTT: మూవీ లవర్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలో మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?

మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసిన మంజుమ్మెల్ బాయ్స్. ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఏకంగా రూ.230 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి మలయాళ మూవీగా రికార్డుల కెక్కింది. ఏప్రిల్ 6న తెలుగులో విడుదలైన ఈ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చాయి

Manjummel Boys OTT: మూవీ లవర్స్ గెట్ రెడీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలో మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
Manjummel Boys
Follow us

|

Updated on: May 04, 2024 | 5:36 PM

ప్రస్తుతం మలయాళ సినిమాలకు ఉన్న క్రేజ్, ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ప్రేమలు, భ్రమయుగం తదితర సినిమాలు తెలుగులోనూ భారీ కలెక్షన్లు రాబట్టాయి. అంతేకాదు ఓటీటీలోనూ ఈ సినిమాలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడిదే కోవలో మరో మలయాళ బ్లాక్ బస్టర్ ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు సిద్ధమైంది. అదే మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసేసిన మంజుమ్మెల్ బాయ్స్. ఫిబ్రవరి 22న థియేటర్లలో రిలీజైన ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఏకంగా రూ.230 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి మలయాళ మూవీగా రికార్డుల కెక్కింది. ఏప్రిల్ 6న తెలుగులో విడుదలైన ఈ మూవీకి భారీ కలెక్షన్లు వచ్చాయి. దీంతో ఈ బ్లాక్ బస్టర్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా? అని సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మంజుమ్మెల్ బాయ్స్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఆదివారం (మే 5) నుంచి ఈ సర్వైవల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి తీసుకురానుంది. అంటే ఇవాళ్టి అర్ధరాత్రి నుంచే ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.

ఇవి కూడా చదవండి

మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ మంజుమ్మెల్ బాయ్స్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుంది. చిదంబర్ పీ పొదువల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మంజుమ్మెల్ బాయ్స్ సినిమాలో శోభున్ షాహిర్ తో పాటు, శ్రీనాథ్ బాసి, బాలు వర్గేస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, దీపక్, అరుణ్, అభిరాం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. యదార్థ సంఘటనల ఆధారంగా ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాను తెరకెక్కించారు. కోడైకెనాల్ లోని అత్యంత ప్రమాదకరమైన గుహను చూడటానికి కేరళ నుండి ఒక స్నేహితుల బృందం టూర్ కు వెళతుంది. అయితే స్నేహితుల్లో ఒకరు ప్రమాదవశాత్తూ గుహలో పడిపోతారు. మరి ఆ యువకుడిని ఆ బృందం ఎలా కాపాడుకుంది? వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, వాటిని ఎలా ఎదుర్కొన్నారన్నదే మంజుమ్మెల్ బాయ్స్ సినిమా. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయ్యారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
ఈ ఆకులు తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య మాయం అవ్వడం ఖాయం!
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
పోలీసులపై చింతమనేని దౌర్జన్యం.. ఈ సెక్షన్ల కింద 94వ కేసు నమోదు..
భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి
భూవివాదంలో మాజీ మంత్రి.. పోలీసుల అదుపులో మల్లారెడ్డి
పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!
పైకి చూస్తే అదొక గుడిసె.. కానీ లోపలకెళ్లి చూడగా మతిపోవాల్సిందే.!
ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!
ఇలా చేశారంటే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అమాంతం పెరుగుతాయి!
ప్రకాష్ రాజ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ప్రకాష్ రాజ్ మొదటి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
ఆర్‌సీబీకి కలిసొచ్చిన 'నెంబర్ 18' సెంటిమెంట్.. అదేంటంటే?
ఆర్‌సీబీకి కలిసొచ్చిన 'నెంబర్ 18' సెంటిమెంట్.. అదేంటంటే?
డబ్బులు డబుల్ చేసి ఆశ చూపిన నేరగాళ్లు.. ఆపై ఏం చేశారంటే..
డబ్బులు డబుల్ చేసి ఆశ చూపిన నేరగాళ్లు.. ఆపై ఏం చేశారంటే..
ఏ వైపు పడుకుంటే మంచిది.? నిపుణులు ఏం సూచిస్తున్నారంటే..
ఏ వైపు పడుకుంటే మంచిది.? నిపుణులు ఏం సూచిస్తున్నారంటే..
గీతాంజలి మూవీ హీరోయిన్ గుర్తుందా.? ఎలా ఉండేది.. ఎంతలా మారిపోయింది
గీతాంజలి మూవీ హీరోయిన్ గుర్తుందా.? ఎలా ఉండేది.. ఎంతలా మారిపోయింది