Kaala Web Series: ఓటీటీలోకి వచ్చేసిన నివేదా పేతురాజ్‌ తొలి వెబ్‌ సిరీస్‌.. ‘కాలా’ తెలుగు స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నివేదా పేతురాజ్ కూడా డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టింది. మెంటల్‌ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలా వైకుంఠపురం, రెడ్, పాగల్‌, విరాటపర్వం వంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార. ఈ ఏడాది విష్వక్‌సేన్‌ సరసన దాస్‌ కా ధమ్కీ అనే సినిమాలో చివరిగా కనిపించింది. అలాగే డైరెక్టుగా ఓటీటీలో రిలీజైన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బూ సినిమాలోనూ ఓ కీ రోల్‌ పోషించింది. ఇప్పుడు కాలా వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది

Kaala Web Series: ఓటీటీలోకి వచ్చేసిన నివేదా పేతురాజ్‌ తొలి వెబ్‌ సిరీస్‌.. 'కాలా' తెలుగు స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
Nivetha Pethuraj Kaala Web Series
Follow us
Basha Shek

|

Updated on: Sep 21, 2023 | 11:33 AM

ఓటీటీలో వెబ్‌ సిరీస్‌లకు ఉన్న క్రేజ్‌గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సబ్‌ స్క్రైబర్లను పెంచుకునేందుకు సరికొత్త కంటెంట్‌తో వెబ్‌ సిరీస్‌లు, ఒరిజినల్స్‌ను అందుబాబులోకి తెస్తున్నాయి డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్. ఇక స్టార్ నటీనటుడు, డైరెక్టర్లు సైతం వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్‌ సిరీస్‌లు చేస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. అలా తాజాగా ప్రముఖ హీరోయిన్‌ నివేదా పేతురాజ్ కూడా డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టింది. మెంటల్‌ మదిలో, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలా వైకుంఠపురం, రెడ్, పాగల్‌, విరాటపర్వం వంటి సూపర్‌హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార. ఈ ఏడాది విష్వక్‌సేన్‌ సరసన దాస్‌ కా ధమ్కీ అనే సినిమాలో చివరిగా కనిపించింది. అలాగే డైరెక్టుగా ఓటీటీలో రిలీజైన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ బూ సినిమాలోనూ ఓ కీ రోల్‌ పోషించింది. ఇప్పుడు కాలా వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అవినాష్‌ తివారీ హీరోగా నటించిన ఈ సిరీస్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరీఓ ఆఫీసర్‌ సితారగా కనిపించింది నివేద. రోహన్‌ వినోద్‌ మెహ్రా, నితిన్‌ గులాటి, అనిల్ ఛటర్జీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో కాలా వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

కాలా వెబ్‌ సిరీస్‌కు బిజాయ్‌ నంబియార్‌ దర్శకత్వం వహించారు. ప్రముఖ టీ- సిరీస్‌ బ్యానర్‌పై భూషణ్‌ కుమార్‌, కిషణ్‌ కుమార్‌, బిజాయ్‌ నంబియార్‌ సంయుక్తంగా ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌ను నిర్మించారు. ఇక కథ విషయానికొస్తే.. కోల్‌కతాలోని మనీలాండరింగ్‌, హవాలా స్కామ్‌లతో సాగే క్రైమ్‌, యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్‌ ఇది. ఇందులో పలు యాక్షన్‌ సన్నివేశాల్లో కూడ నటించింది నివేద. ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని ఆమె హర్షం వ్యక్తం చేస్తోంది. కాలా వెబ్‌ సిరీస్ తర్వాత పరువు అనే మరో తెలుగు వెబ్‌ సిరీస్‌లో నటిస్తోంది నివేద. అలాగే తెలుగు, తమిళ భాషల్లో పలు కొత్త సినిమాలకు కూడా ఓకె చెప్పింది.

డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో కాలా వెబ్‌ సిరీస్‌..

కాలా వెబ్ సిరీస్ ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
తాను హమాలీగా పనిచేసే సంస్థకి కూతురు ఆఫీసరుగా వస్తే.! వీడియో వైరల్
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
చిన్నారి ఉసురు తీసిన బిస్కెట్‌.! ఒక్కసారిగా ఊపిరాడక ఇబ్బంది..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పొరుగింట్లో ప్రమాదం జరిగిందని చూడ్డానికి వెళ్తే ప్రాణాలే పోయాయి..
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పాపం ఎంత వేధించారో.. ఏకంగా బైకే తగలబెట్టేశాడు.!
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
పెళ్లి కాని ప్రసాద్‌లకు స్వీట్ న్యూస్.! యువ రైతులకు పిల్లనిచ్చే..
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..
సీఎం రేవంత్ ప్రకటనపై రైతుల్లో ఆసక్తి.! రైతు పండుగ బహిరంగ సభ..