Nita Ambani: నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.!
ఐపీఎల్ మెగా వేలం-2025 మొదటి విడత ప్రక్రియ ఆదివారం ముగిసింది. అంచనాలను నిజం చేస్తూ టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రూ.27 కోట్లు, శ్రేయాస్ అయ్యర్ రూ.26.5 కోట్లు పలికారు. మరికొందరు ప్రతిభావంతులైన క్రికెటర్లపై ఫ్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి. కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. కాగా ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యజమాని, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ హాజరయ్యారు.
ఐపీఎల్ మెగా వేలంలో ముకేశ్ అంబానీ భార్య నీతా అంబానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నీతా ధరించిన నీలం రంగు ప్యాంట్‌సూట్ అందరినీ ఆకర్షించింది. అయితే దాని ధర తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు. నీతా అంబానీ ధరించిన ఈ ప్యాంట్‌సూట్ రేటు అక్షరాలా 950 డాలర్లు. ‘మజే’ బ్రాండ్‌కు చెందిన ఈ సూట్ భారతీయ కరెన్సీలో దాదాపు రూ.78 వేలు ఉంటుంది. ఈ సూట్ ప్రైస్ ట్యాగ్‌ను ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశాడు. ఈ ధర తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా ఆదివారం జరిగిన ఐపీఎల్ వేలానికి నీతా అంబానీ సన్ గ్లాసెస్, ఆకర్షణీయమైన డైమండ్ చెవిపోగులు, ప్రత్యేక ఉంగరాన్ని ధరించి వచ్చారు. ఆమె ధరించిన వాచ్, హీల్స్ కూడా ప్రత్యేకంగా కనిపించాయి. ఆమె చేతిలో విలాసవంతమైన ఒక హ్యాండ్‌బ్యాగ్ కూడా కనిపించింది. కాగా నీతా అంబానీ దుస్తుల ఎంపిక విషయంలో ఎప్పటికప్పుడు ట్రెండీగా ఉంటారన్న విషయం తెలిసిందే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ఆంటీ అని పిలిచినందుకు.. మేల్ నర్స్‌కు జరిమానా
నేపాల్‌లో గుట్కా ఉమ్మిన భారతీయులు.. నీళ్లు పోసి కడిగించిన వీడియో
ప్రేతాత్మ తిరుగుతోందంటూ కాలేజీలో పూజలు
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్

