డబ్బు కోసం బరితెగిస్తున్నారు.. బయట సెలూన్‌ పటారం.. లోపల మాత్రం బెడ్‌ చాటు యాపారం

హాంకాంగ్‌ - బ్యాంకాక్‌ ఎందుకు దండగ... ! స్వర్గం ఇక్కడే ఉండగా.. అవును.. భారత్‌లోనూ థాయ్‌ రాజా థాయ్‌ అంటూ పేట్రేగిపోతోంది స్పా మాఫియా. మసాజ్‌ ముసుగులో బ్రోతల్‌ దందా నడుస్తోంది. గల్లీ గల్లీలో ఈ గలీజ్‌ కల్చర్ కనిపిస్తోంది. వెల్‌నెస్‌ స్పా అంటూ... లోపల డర్టీ పిక్చర్‌ నడిపిస్తున్నారు. ఇలాంటి విచ్చలవిడి యవ్వారానికి అడ్డుకట్ట పడేలా గుజరాత్‌లో ఓ అడుగు ముందుకు పడింది. మరి మన దగ్గర పరిస్థితేంటి...? ఈ స్పాకు అడ్డుకట్ట పడేదెన్నడు...?

డబ్బు కోసం బరితెగిస్తున్నారు.. బయట సెలూన్‌ పటారం.. లోపల మాత్రం బెడ్‌ చాటు యాపారం
Spa
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 01, 2024 | 9:14 AM

ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. ఇప్పుడు ఎక్కడ చూసినా స్పా సెంటర్లు కనిపిస్తున్నాయి. అద్దిరిపోయే ఇంటీరియర్‌తో.. కళ్లు జిగేల్‌మనే యాంబియన్స్‌తో దర్శనిమిస్తున్నాయి. బయట హెల్తీ కొటేషన్స్‌ కనిపిస్తాయ్.. ఇక లోపలికి వెళ్తే కథ వేరుంటది. స్పాతో బ్రోతల్‌ దందా చేస్తున్నారు. మసాజ్‌ల మాటున రోత వ్యవహారం నడిపిస్తున్నారు. మెన్యూలు పెట్టి మరీ యధేచ్చగా వ్యభిచారం చేస్తున్నారు కేటుగాళ్లు.. అక్కడా.. ఇక్కడా అనేంలేదు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తోంది ఈ దరిద్రపు దందా. పట్టుపడితే ఫేస్‌ ఆఫ్‌… దొరక్కపోతే దొరబాబే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎందరో యువతుల్ని ఈ రొంపిలోకి దింపుతూ వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతున్నారు కంత్రీగాళ్లు. నిరుద్యోగ యువతులను ఈ దందాలోకి దింపి డబ్బులు దండుకుంటున్నారు.

దేశవ్యాప్తంగా ప్రతిరోజూ ఇలాంటి దందాలెన్నో బయటపడుతున్నాయి. స్పా, మసాజ్‌ సెంటర్ల మాటున వ్యభిచారం చేస్తున్న కేటుగాళ్లు నిత్యం దొరుకుతూనే ఉన్నారు. అధికారులు సైతం తనిఖీలు నిర్వహిస్తూ… ప్రతిరోజు వందల సంఖ్యలో స్పా సెంటర్లను సీజ్‌ చేస్తున్నానే ఉన్నారు. అయినా ఈ దర్టీ దందా మాత్రం ఆగట్లేదు. ఇక ఇలాంటి కల్చర్‌ను కత్తిరించాలంటూ గుజరాత్‌ ప్రభుత్వానికి అక్కడి సీఐడీ కీలక సూచనలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ అంటూ ఓ చిన్నపాటి చిట్టానే గుజరాత్‌ ప్రభుత్వం ముందుంచింది సీఐడీ. స్పాలో మెయిల్‌ అండ్‌ ఫీమేల్ రూమ్స్‌ వేరుగా ఉండాలన్న నిబంధనలు పెట్టాలని సూచించింది. స్పాలో పనిచేసే ఉద్యోగులకు తప్పనిసరిగా ఐడీ కార్డ్‌ ఉండేలా చూసుకోవాలని… స్పా రూమ్‌ ఎప్పటికీ తెరిచే ఉండాలని… స్పా సెంటర్‌లో రాత్రి బస అనుమతించకూడదని.. అంతేకాదు స్పా అండ్‌ మసాజ్‌ సెంటర్లకు తప్పనిసరిగా ఆరోగ్యశాఖ నుండి ట్రేడ్ లైసెన్స్ ఉండాల్సిందేనన్న నిబంధనలు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇక స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు జరపాలంటూ రూల్స్‌ లిస్ట్‌లో పేర్కొంది సీఐడీ.

మొత్తంగా.. స్పా అండ్‌ మసాజ్‌ సెంటర్ల మాటున జరుగుతున్న బ్రోతల్ దందాను అరికట్టేందుకు ఓ అడుగు ముందుకేసిన సీఐడీ… ప్రభుత్వం ముందు పలు సూచనలు ఉంది. ప్రభుత్వం కూడా సీఐడీ సూచనలకు సానుకూలంగా స్పందించింది. రేపో మాపో ఈ రూల్స్‌ పాస్‌ చేసే అవకాశమూ కనిపిస్తోంది. గుజరాత్‌ సంగతి సరే.. మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటి…? హైదరాబాద్, వైజాగ్‌లో స్పా పేరుతో నడుస్తున్న గలీజ్‌ వ్యాపారానికి అడ్డుకట్టపడేదెప్పుడు…? మనకూ అలాంటి రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ ఉంటేనే బాగుంటుంది కదా…! అన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..