Raw Onion: పచ్చి ఉల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా.? ఆ సమస్యలకు కూడా చెక్..
భారతీయ వంటకాల్లో కనిపించే వాటిల్లో ఉల్లిపాయ ముఖ్యమైనది. దీనిని దాదాపుగా అన్ని కూరల్లో ఎక్కువగా వాడుతుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలామంది ప్రతీ రోజూ తీసుకునే ఆహారంలో ఉల్లిపాయలను ఒక భాగంగా చేసుకుని తింటుంటారు. అయితే, పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో భాగంగా చేసుకొని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది కూరల్లో వేసినా సరే, పచ్చి ఉల్లిని భోజనంతోపాటు తింటుంటారు.
శరీరాన్ని ఉల్లి అనేక అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతీరోజూ ఉల్లిపాయను తినడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి పచ్చి ఉల్లిపాయలు మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎన్నో రకాల రోగాల బారి నుండి శరీరాన్ని కాపాడుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా పచ్చి ఉల్లి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి, కేలరీలు తక్కువగా ఉంటాయి. పచ్చి ఉల్లిని ఆహారంతో తినడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. దీని వల్ల ఆహారాన్ని ఎక్కువగా తినలేరు. పచ్చి ఉల్లిపాయను ఆహారంలో భాగంగా ప్రతి రోజూ తింటే చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ఇందులో సల్ఫర్ సమ్మేళనం ముఖంపై ఉన్న మొటిమలను తగ్గించి, స్కిన్ ను సాఫ్ట్‌గా ఉంచుతుంది.
గుండె ఆరోగ్యానికి పచ్చి ఉల్లి ఉపయోగపడుతుంది. పచ్చి ఉల్లిలో ప్లేవనాయిడ్లు, థయోసల్పినేట్లు అనే సమ్మేళనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, ఉల్లిపాయను తింటే ప్రయోజనాలు ఉన్నాయని అదే పనిగా ప్రతీసారి ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనిని నిత్యం కొద్ది మోతాదులోనే తీసుకోవడం మంచిది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.