Health: అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!

Health: అరటి, యాపిల్ కలిపి తింటున్నారా.? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.!

Anil kumar poka

|

Updated on: Nov 30, 2024 | 6:05 PM

పోష‌కాల గ‌నిగా అరటిపండుకు పేరు. దీనిని ఇష్టపడనివారుండరు. అన్ని కాలాల్లోనూ ల‌భించే అర‌టి పండు ఆక‌లిని తీర్చడ‌మే కాదు శ‌రీరానికి అవ‌స‌ర‌మైన సూక్ష్మ పోషకాల‌నూ అందిస్తుంది. అలాంటిదే మరో ముఖ్యమైన, పోషకవిలువలు అధికంగా ఉండే పండు యాపిల్‌. ప్రతిరోజు ఒక యాపిల్ తింటే వైద్యుడి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం రాదు అనే నానుడి అందరికీ తెలిసిందే.

పండ్లను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అంది, ఆరోగ్యంగా ఉండగలం అనేది అందరికీ తెలిసిన ఆరోగ్య రహస్యం. అయితే అరటి పండు, యాపిల్‌ కలిపి తింటే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా.? రుచిలో ఎంతో మధురంగా ఉండే అరటిపండు విటమిన్లు, ఖనిజాల గని. ఆపిల్‌లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, బీటా కెరోటిన్ వంటి అనేక పోషకాలు మంచి పరిమాణంలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తాయి. యాపిల్ లో ఉండే విటమిన్ ఎ, సి, కాల్షియం, పొటాషియం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. క్యాన్సర్, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, అల్జీమర్స్‌ తో పాటు మరికొన్ని వ్యాధులతో పోరాడే శక్తిని యాపిల్ శరీరానికి అందిస్తుంది. రోజూ యాపిల్ తినడం వల్ల అందులోని పెక్టిన్.. చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది.

అరటి పండు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా, సోడియం తక్కువగా ఉంటుంది. ఫలితంగా బీపీ అదుపులో ఉంటుంది. అరటి పండులోని విటమిన్స్, మినరల్స్, ఫైబర్ వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్సర్ ను సైతం అరటి పండు దూరం చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శారీరకంగా శక్తి తక్కువగా ఉన్నవారు అరటి, యాపిల్ కలిపి తినాలి. ఇది తక్షణ శక్తిని అందిస్తుంది. అరటి, యాపిల్ కలిపి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి బలహీనంగా ఉంటే, ఆపిల్, అరటిపండు కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది. యాపిల్, అరటిపండులో కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి. అయితే ఈ రెండు పండ్లను ఎక్కువ పరిమాణంలో తింటే మాత్రం గ్యాస్ సమస్య తలెత్తే అవకాశం ఉంది. అందుకే రోజూ తగినంత మోతాదులో వీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.