AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madraskaaran: ఓటీటీలోకి వచ్చేసిన నిహారిక కొణిదెల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యాంకరింగ్ ద్వారా బుల్లితెరపై సినీప్రయాణం స్టార్ట్ చేసి.. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటనకు ప్రాధాన్యత ఉన్నచిత్రాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. తాజాగా ఆమె నటించిన ఓ తమిళ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.

Madraskaaran: ఓటీటీలోకి వచ్చేసిన నిహారిక కొణిదెల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Madraskaaran
Rajitha Chanti
|

Updated on: Feb 26, 2025 | 9:41 AM

Share

మెగా డాటర్ నిహారిక చాలా కాలం తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే తమిళంలో యాక్షన్ డ్రామాగా వచ్చిన మద్రాస్కారణ్ సినిమాతో మరోసారి వెండితెరపై సందడి చేసింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. ఈ సినిమా నిహారికతోపాటు షేన్ నిగమ్, కలైయరాసన్, ఐశ్వర్య దత్తా కీలకపాత్రలు పోషించారు. రివేంజ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈసినిమా దాదాపు రూ.80 లక్షలు రాబట్టింది. అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా హిట్ కాలేకపోయింది. ఇదిలా ఉంటే..ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈనెల మొదట్లోనే తమిళ్ వెర్షన్ ఓటీటీ స్ట్రీమింగ్ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు తెలుగులనూ అందుబాటులోకి తీసుకువస్తున్నారు మేకర్స్.

మద్రాస్కారణ్ సినిమా తెలుగు వెర్షన్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా వీడియోలో బుధవారం (ఫిబ్రవరి 26న) స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని ఆహా వీడియో అధికారికంగా ప్రకటించింది. “కొత్త వ్యక్తుల మధ్య జరిగిన ఓ చిన్న వాగ్వాదం వాళ్ల జీవితాలను మార్చే సంఘర్షణకు దారితీసింది. ఒక్క క్షణం ఎప్పటికీ మన దృక్పథాన్ని, పరిస్థితులను మార్చేస్తుందో చూడండి. మద్రాస్కారణ్ ఫిబ్రవరి 26 నుంచి ఆహాలో” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

కథ విషయానికి వస్తే.. సత్య (షేన్ నిగమ్)తో మీరా (నిహారిక) పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్లి పనుల్లో ఉండగా సత్య ఓ యాక్సిడెంట్ చేస్తాడు. ఈ ప్రమాదంలో కళ్యాణి గాయపడుతుంది. దీంతో సత్య పై దురైసింగం అనే వ్యక్తి పగను పెంచుకుంటాడు. సత్య కుటుంబంపై దురైసింగం ఎటాక్ చేస్తారు.. ? ఆ తర్వాత ఏం జరిగింది.. ? నిహారిక జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది సినిమా.ఈ సినిమా మీరా అనే అమ్మాయిగా గ్లామర్ రోల్ లో కనిపించింది నిహారిక.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..