The Ghost OTT: ది ఘోస్ట్ చిత్రం ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. అధికారిక ప్రకటన వచ్చేసింది.. ఎక్కడంటే..
శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్... పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇందులో నాగ్.. విక్రమ్ అనే ఇంటర్ పోల్ అధికారిగా కనిపించారు.
అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం ది ఘోస్ట్. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. యాక్షన్ థ్రిలర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటించింది. ఎన్నో అంచనాల మధ్య థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కేవలం మాస్ లవర్స్‌ను మాత్రమే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలయ్యేందుకు సిద్ధమయ్యింది. ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.. నవంబర్ 2న ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.
మంగళవారం ఇన్ స్టా వేదికగా ది ఘోస్ట్ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 2న ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని తెలిపింది. ది ఘోస్ట్ సినిమా పోస్టర్ షేర్ చేస్తూ.. అతనికి వ్యతిరేకంగా వెళ్లే వ్యక్తులు ఒక పీడకల సిద్ధం కావాలి. ఎందుకంటే చనిపోయినవారి నుంచే దెయ్యం తిరిగి వస్తుంది. ఘోస్ట్ నవంబర్ 2న నెట్ ఫ్లిక్స్ లోకి వస్తుంది అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్… పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఇందులో నాగ్.. విక్రమ్ అనే ఇంటర్ పోల్ అధికారిగా కనిపించారు. అతని ప్రేయసి ప్రియ అనే అమ్మాయిగా సోనాల్ కనిపించింది. అయితే థియేటర్లలో మెప్పించలేక పోయిన ది ఘోస్ట్.. ఇక ఇప్పుడు ఓటీటీలో ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.