Samantha: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన సమంత ?.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటుందంటే..
కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సామ్..ఇప్పుడిప్పుడె తిరిగి యాక్టివ్ అవుతుంది. కేవలం సినిమా అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. ఆమె నటించిన దశోద చిత్రం ట్రైలర్ అప్డేట్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది సమంత.
టాలీవుడ్ అగ్రకథానాయికలలో సమంత ఒకరు. ప్రస్తుతం సామ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కిన శాకుంతలం, యశోద చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరోవైపు డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి చిత్రీకరణలో పాల్గొంటుంది సామ్. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఇక తెలుగులోనే కాకుండా హిందీలోనూ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. డైరెక్టర్ సుకుమార్.. అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రంలోని స్పెషల్ సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది సామ్. దీంతో తన తదుపరి చిత్రాలకు ఆమె భారీగా రెమ్యునరేషన్ పెంచినట్లుగా ఇండస్ట్రీలోకి టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమె చేయబోయే సినిమాలకు దాదాపు రూ. 3-8 కోట్లు వసూలు చేస్తుందని సమాచారం.
ఇప్పటివరకు తెలుగులో సామ్ ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లు తీసుకుందని.. ఇక ఇప్పుడు బాలీవుడ్ చిత్రాలకు దాదాపు రూ. 5-8 కోట్లు తీసుకుంటున్నట్లుగా టాక్ నడుస్తుంది. ప్రస్తుతం సామ్ హిందీలో యంగ్ హీరో వరుణ్ దావన్ సరసన సిటాడెల్ చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్న తెలుస్తోంది.
అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సామ్..ఇప్పుడిప్పుడె తిరిగి యాక్టివ్ అవుతుంది. కేవలం సినిమా అప్డేట్స్ మాత్రమే షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. ఆమె నటించిన దశోద చిత్రం ట్రైలర్ అప్డేట్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది సమంత. లేడీ ఓరియెంటెడ్ గా రాబోతున్న ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ తెలుగుతోపాటు.. తమిళం, కన్నడ, మలయాళంలో నవంబర్ 11న విడుదల చేయనున్నారు.
I’ll be seeing you ♥️ #YashodaTrailer on 27th Oct @ 5.36 PM?#YashodaTheMovie @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan #Manisharma @krishnasivalenk @SrideviMovieOff @PulagamOfficial pic.twitter.com/TCrIaR7thj
— Samantha (@Samanthaprabhu2) October 24, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.