AHA: సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో జీవితాలను తలకిందులు చేస్తే.. ఆహాలో మరో ఆసక్తికరమైన చిత్రం..
వినోదాన్ని పంచుతూ తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంటోన్న తొలి తెలుగు ఓటీటీ ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంటోంది. వెబ్‌సిరీస్‌లు, సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికరమైన సినిమాను..
వినోదాన్ని పంచుతూ తెలుగు ప్రేక్షకులకు ఆకట్టుకుంటోన్న తొలి తెలుగు ఓటీటీ ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌తో ఆకట్టుకుంటోంది. వెబ్‌సిరీస్‌లు, సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో ఆసక్తికరమైన సినిమాను అందిస్తోంది. అలీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ సినిమా ఆహా వేదికగా ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మలయాళం సినిమా ‘వికృతి’కి ఈ చిత్రాన్ని రీమేక్‌గా తెరకెక్కించారు.
ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన ఫొటో వెనకాల అసలు కథ ఏంటి.? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్‌ను నెలకొల్పి అలీ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. అలీ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమాలో నరేష్, పవిత్రా లోకేష్‌లు నటిస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో డిజిటల్ ఐడియాకు అనుగుణంగా ఈ సినిమా కథాంశాన్ని రూపొందించారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో వల్ల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి వంటి ఆసక్తికర పాయింట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
Oka photo online lo sanchalanam chesthe. Ela untundi? ? Daani venuka story enti? Watch the official remake of Vikruthi #AndaruBaagundaliOnAHA Premieres Oct 28#Ali pic.twitter.com/R8rA4yO6EZ
— ahavideoin (@ahavideoIN) October 24, 2022
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. వైవిధ్యభరిమతైన కథాంశంతో వస్తోన్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని చిత్ర యూనిట్ బలంగా చెబుతోంది. ఇక ఈ చిత్రాంలో అలీ, నరేశ్, పవిత్రా లోకేష్ ప్రధాన పాత్రదారులుగా నటిస్తుండగా మౌర్యాని, మంజుభార్గవి, తనికెళ్ల భరణి, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తదితరులు ఇతర పాత్రలో నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..