Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable 2: రెట్టించిన ఉత్సాహంతో అన్‌స్టాపబుల్‌2.. లైనప్‌ మాములుగా లేదుగా, తర్వాత గెస్ట్‌ ఎవరంటే..

ఓటీటీ చరిత్రలో సరికొత్త టాక్‌ షోకు తెరతీస్తూ తొలి తెలుగు ఓటీటీ ఆహా పరిచయం చేసిన 'అన్‌స్టాపబుల్‌' ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పంచ్‌ డైలాగ్‌లు, మాస్‌ యాక్షన్‌ సీన్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్‌ వేయించే నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా...

Unstoppable 2: రెట్టించిన ఉత్సాహంతో అన్‌స్టాపబుల్‌2.. లైనప్‌ మాములుగా లేదుగా, తర్వాత గెస్ట్‌ ఎవరంటే..
AHA Unstoppable 2 Upcoming Guest
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 26, 2022 | 6:19 PM

ఓటీటీ చరిత్రలో సరికొత్త టాక్‌ షోకు తెరతీస్తూ తొలి తెలుగు ఓటీటీ ఆహా పరిచయం చేసిన ‘అన్‌స్టాపబుల్‌’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పంచ్‌ డైలాగ్‌లు, మాస్‌ యాక్షన్‌ సీన్స్‌తో థియేటర్లలో ప్రేక్షకులతో విజిల్స్‌ వేయించే నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షోకు రికార్డు స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి. కుర్ర హీరోలతో పోటీ పడీ మరీ బాలకృష్ణ చూపించిన ఉత్సాహం వీక్షకులను తెగ ఎంజాయ్‌ చేసేలా చేస్తున్నాయి. ఇక అన్‌స్టాపబుల్‌ ఫస్ట్‌ సీజన్‌ ముగిసన కొన్ని రోజుల గ్యాప్‌ తర్వాత సీజన్‌2 మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభమైన విషయం తెలిసిందే.

సీజన్‌2ని ఎవరూ ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ప్రారంభించిన ఒక్కసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ షోకు భారీ ఎత్తున వ్యూయర్‌షిప్‌ వచ్చింది. ఇక అనంతరం రెండో ఎపిసోడ్‌లో యంగ్‌ హీరోస్‌ విశ్వక్‌ సేన్‌, సిద్ధు జొన్నలగడ్డ చేసిన హంగామా అంతా ఇంతకాదు. ఎనర్జీ విషయంలో వీరిద్దరికి పోటీ ఇచ్చారు బాలకృష్ణ. రెండో ఎపిసోడ్‌కి కూడా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో నిర్వహకులు తర్వాతి ఎపిసోడ్స్‌ను కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఎపిసోడ్స్‌ను మరింత ఆసక్తికరంగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు.

Adivi Sesh, Sharwanand

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే మూడో ఎపిసోడ్‌ కోసం ఇండస్ట్రీలో ఉన్న మరో ఇద్దరు యంగ్‌స్టార్స్‌ అయిన అడవి శేష్‌, శర్వానంద్‌లను ముఖ్య అతిథులుగా ఆహ్వానించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇక నాలుగో ఎపిసోడ్‌లో రమ్యకృష్ణ, రాశీఖన్నాను తీసుకురానున్నారని సమచారం. ఇక ఇటీవలే త్రివిక్రమ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌తో షోకి రావాలని బాలకృష్ణ హింట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇలా వరుసగా ప్రముఖులను ఆహ్వానిస్తూ సెకండ్‌ సీజన్‌ను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దేందుకు మేకర్స్‌ పక్కా స్కెచ్‌ వేస్తున్నారని తెలుస్తోంది. అయితేఈ వార్తలపై ఓ క్లారిటీ రావాలంటే ఆహా నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

rashi khanna and rashi khanna in unstoppable 2

 

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..