AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara-vignesh: నయనతార సరోగసి వివాదంపై విచారణ కమిటీ నివేదిక.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు..

నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ల సరోగసి వ్యవహారానికి ఒక ఫుల్‌ స్టాప్‌ పడినట్లు తెలుస్తోంది. ఈ జంట పెళ్లైన నాలుగు నెలలకే కవలలకు జన్మనిచ్చారన్న వార్త ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ నిబంధనలకు విరుద్ధంగా సరోగసి విధానాన్ని ఆశ్రయించారని..

Nayanthara-vignesh: నయనతార సరోగసి వివాదంపై విచారణ కమిటీ నివేదిక.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు..
Nayanthara vignesh surrogacy
Narender Vaitla
|

Updated on: Oct 26, 2022 | 6:16 PM

Share

నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ల సరోగసి వ్యవహారానికి ఒక ఫుల్‌ స్టాప్‌ పడినట్లు తెలుస్తోంది. ఈ జంట పెళ్లైన నాలుగు నెలలకే కవలలకు జన్మనిచ్చారన్న వార్త ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ నిబంధనలకు విరుద్ధంగా సరోగసి విధానాన్ని ఆశ్రయించారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏకంగా తమిళనాడు ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఇందులో భాగంగానే సరోగసి వ్యవహారంపై విచారణ కమిటీకి ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ పూర్తి చేసిన కమిటీ తాజాగా బుధవారం తమ నివేదికను సమర్పించింది.

విచారణ కమిటీ ఇచ్చిన నివేదకలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నయనతార, విఘ్నేశ్‌ దంపతుల సరోగసి వ్యవహారం చట్టబద్ధంగానే జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో సరోగసి ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఆస్పత్రి వైద్యులను, సిబ్బందిని విచారించినట్లు నివేదికలో పేర్కొన్నారు. సరోగసి ప్రక్రియలో చట్టబద్ధమైన నిబంధనలు ఫాలో అయ్యారని విచారణలో తేలింది. ఇక అద్దె గర్భం దాల్చిన సదరు మహిళకు వివాహమైందని కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తేల్చి చెప్పింది.

ఇక 2016 మార్చి 11న నయనతార, విఘ్నేశ్‌ దంపతులకు వివాహం అయినట్లు అఫిడవిట్‌లో తెలిపిన విషయం విధితమే. సరోగసి ప్రక్రియ 2021 ఆగస్టులో మొదలైందని అధికారులు పేర్కొన్నారు. 2021 నవంబర్‌లో సరోగసి విధానంపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. దీంతో గత కొన్ని రోజులుగా నయనతార, విఘ్నేశ్‌ జంటపై వస్తోన్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లైంది. ఈ జంట చట్టబద్ధంగానే వివాహమైన ఐదేళ్లకు సరోగసి విధానాన్ని అనుసరించినట్లు తేలింది. దీంతో నయనతార, విఘ్నేశ్‌లు అరెస్ట్‌ అవుతారంటూ వచ్చిన వార్తలకు చెక్‌ పడింది.

ఇవి కూడా చదవండి

నయనతార ఫ్యామిలీ డాక్టర్‌ సూచన మేరకే..

ఇదిలా నయనతార ఫ్యామిలీ డాక్టర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రైవేటు హాస్పిటల్‌ వైద్యులు సరోగసి ప్రక్రియని ప్రారంభించినట్లు నివేదికలో అధికారులు తెలిపారు. అయితే కమిటీ సభ్యులు నయనతార ఫ్యామిలీ డాక్టర్‌ను విచారించలేకపోయారు. దీనికి కారణం ప్రస్తుతం ఆమె విదేశాలకు వెళ్లిపోవడమే. ఫోన్‌లో కూడా అందుబాటులో లేకపోవడం వల్లే ఫ్యామిలీ డాక్టర్‌ను విచారించలేకపోయామని కమిటీ తన నివేదికలో తెలిపింది. మరి ఫ్యామిలీ డాక్టర్‌ చెప్పే విషయాలు నయనతార సరోగసి వ్యవహారాన్ని ఏమైనా మలుపు తిప్పుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..