AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: అతన్ని నమ్మండి, మీరు ఆశ్చర్యపోయే సినిమా అందించనున్నారు.. ఆదిపురుష్‌పై బాలీవుడ్‌ నటుడు ధీమా..

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఆది పురుష్‌. అంత్యంత ప్రాతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఏమంటూ ఈ సినిమా టీజర్‌ విడుదలైందో ఒక్కసారిగా వివాదాలు చుట్టుముట్టాయి. టీజర్‌ అస్సలు బాలేదంటూ...

Adipurush: అతన్ని నమ్మండి, మీరు ఆశ్చర్యపోయే సినిమా అందించనున్నారు.. ఆదిపురుష్‌పై బాలీవుడ్‌ నటుడు ధీమా..
Sharad Kelkar About Adipurush Movie
Narender Vaitla
|

Updated on: Oct 26, 2022 | 2:39 PM

Share

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ఆది పురుష్‌. అంత్యంత ప్రాతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఏమంటూ ఈ సినిమా టీజర్‌ విడుదలైందో ఒక్కసారిగా వివాదాలు చుట్టుముట్టాయి. టీజర్‌ అస్సలు బాలేదూ, యానిమేషన్‌ చిత్రంలా ఉందంటూ కొందరు వాదిస్తే, మరికొందరేమో మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయంటూ వివాదాలకు ఆజ్యం పోశారు. అయితే అనంతరం విడుదలైన 3డీ వెర్షన్‌ టీజర్‌తో ట్రోలింగ్‌కు కాస్త చెక్‌ పడినట్లైంది. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్‌ నటుడు శరద్‌ కేల్కర్‌ ఆదిపురుష్‌కు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శరద్‌ కేల్కర్‌ ఆదిపురుష్‌లో ప్రభాస్ పాత్రకు హిందీలో డబ్బింగ్‌ చెప్పనున్నారు.

ఆదిపురుష్‌ సినిమా అద్భుతంగా ఉండనుందన్న శరద్‌.. తాను ఇంకా పూర్తిగా డబ్బింగ్‌ చెప్పలేదని. కానీ, ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూశానని చెప్పుకొచ్చారు. సినిమాలోని సన్నివేశాలు ఎంతో బాగుతున్నాయని చెప్పిన శరద్‌.. ఇంతకు ముందు ఎవ్వరూ ఇటువంటి ప్రయత్నం చేయలేదని తెలిపారు. ఇక దర్శకుడి పనితీరు గురించి మాట్లాడుతూ.. ‘ఓం రౌత్‌ అద్భుతమైన దర్శకుడు. అతడు సినిమాను చూసే దృష్టికోణం వేరు. సినిమాలపై ఆయనకు అపారమైన జ్ఞానం ఉంది. ఇలాంటి వాళ్లు ఈ రోజుల్లో మనకు అవసరం. టీజర్‌ చూసి ఆయన్ని విమర్శించే వారికి నేను చెప్పేది ఒక్కటే.. ఓం రౌత్‌ను నమ్మండి. ఆయన త్వరలోనే మీరు ఆశ్చర్యపోయే సినిమాను అందించనున్నారు’ అని ప్రశంసలు కురిపించారు.

ఇక ఆదిపురుష్‌ చిత్రం విజయం సాధిస్తుందని తాను కచ్చితంగా నమ్ముతున్నానని చెప్పుకొచ్చారు శరద్‌. ఇదిలా ఉంటే ఆదిపురుష్‌ చిత్రం సంక్రాంతి కానుకంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సంక్రాంతికి పలు భారీ చిత్రాల విడుదల నేపథ్యంలో చిత్ర యూనిట్ వెనక్కి తగ్గనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటనరాలేదు. అయితే ఆదిపురుష్‌ ముందుగా అనుకున్నట్లుగానే సంక్రాంతికి వస్తుందా.? లేదా వాయిదా పడనుందా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..