Thandatti : ఓటీటీలో ఆకట్టుకుంటోన్న ‘తండట్టి’ చిత్రం.. ‘బలగం’ మూవీని తలపిస్తోన్న తమిళ్ సినిమా..
ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త సినిమాకు ఓటీటీలోనే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ చిత్రం ఇటీవల సక్సెస్ అయిన బలగం సినిమాను తలపిస్తోంది. అదే తండట్టి. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాకు ముందు నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ సినిమా స్పెషల్ ఏంటో తెలుసుకుందామా.
ప్రస్తుతం ఓటీటీలో అనేక చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా డిజటల్ ప్లాట్ ఫాంపై దూసుకుపోతున్నాయి. తమిళం, కన్నడ, మలయాళంలో సూపర్ హిట్ అయిన పలు చిత్రాలను తెలుగులో డబ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. అదే జాబితాలో ఇటీవల వచ్చిన గుడ్ నైట్ చిత్రం ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో విజయవంతంగా రన్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త సినిమాకు ఓటీటీలోనే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ చిత్రం ఇటీవల సక్సెస్ అయిన బలగం సినిమాను తలపిస్తోంది. అదే తండట్టి. తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాకు ముందు నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ సినిమా స్పెషల్ ఏంటో తెలుసుకుందామా.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి రోహిణి.. సార్పట్ట చిత్రంలో అలరించిన నటుడు పశుపతి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం తండట్టి. గ్రామీణ నేపథ్యంలో ఒక వయసు మళ్లిన మహిళ చావు చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రామ్ సంగయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శామ్ సీఎస్ సంగీతం అందించారు. జూలై 14 నుంచి తమిళంతోపాటు.. తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
సినిమా కథ విషయానికి వస్తే.. సుబ్రహ్మణ్యం (పశుపతి) అనే కానిస్టేబుల్ తన వృత్తిలో ఎంతో నిజాయితీగా ఉంటాడు. కానీ తనకున్న ముక్కుసూటితనంతో ఎక్కడా ఎక్కువ రోజులు వర్క్ చేయలేడు. దీంతో అతను ప్రతిసారి ట్రాన్స్ ఫర్ అవుతుంటాడు. అయితే ఇక పది రోజుల్లో రిటైర్మెంట్ ఉండగా.. అతను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ కు ఓ కేసు వస్తుంది. తన నాన్నమ్మ తంగపొన్ను (రోహిణి) కనిపించకుండా పోయిందంటూ ఓ కుర్రాడు ఫిర్యాదు చేస్తాడు. ఇక ఆమెను వెతకడానికి కిడారిపట్టి అనే ఊరు వెళ్లిన పశుపతి అనుకోని సమస్యలో చిక్కుకుంటాడు. పోలీసులు అంటే ఏమాత్రం ఇష్టం ఉండని ఆ కిడారిపట్టి ఊళ్లోకి అడుగుపెట్టిన పశుపతికి తంగపొన్ను దొరుకుతుంది. కానీ అప్పుడే ఆమె చనిపోవడంతో దహన సంస్కారాలకు ఏర్పాట్లు జరుగుతుంటాయి. ఇక అదే సమయంలో ఆమె ధరించిన విలువైన బంగారు చెవి దుద్దులు పోతాయి.. దీంతో ఆ దుద్దులు ఎవరు కాజేశారు ?.. ఇంతకీ ఆ తంగపొన్ను జీవితం ఏంటీ ? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.