Meet Cute Teaser: నాని నిర్మిస్తోన్న మీట్ క్యూట్ టీజర్ చూశారా ? ..ఆకట్టుకుంటున్న బ్యూటీఫుల్ వీడియో..
ఇప్పుడు నాని నిర్మిస్తోన్న లేటేస్ట్ చిత్రం మీట్ క్యూట్. అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా.. ఓటీటీలో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంట దర్శకత్వం వహించడం మరో విశేషం.

న్యాచురల్ స్టార్ నాని ఇటీవల నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఓవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే మరోవైపు వాల్ పోస్టర్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ బ్యానర్ పేరు మీద ఇప్పటికే పలు సినిమాలను నిర్మించారు. ఇక ఇప్పుడు నాని నిర్మిస్తోన్న లేటేస్ట్ చిత్రం మీట్ క్యూట్. అయితే ఈ మూవీ థియేటర్లలో కాకుండా.. ఓటీటీలో ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రానికి నాని సోదరి దీప్తి గంట దర్శకత్వం వహించడం మరో విశేషం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.
అయితే ఈ సినిమాలో అందరూ యంగ్ హీరోహీరోయిన్స్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి ఒక్కరి ఇద్దరి కలయిక వారి మధ్య వచ్చే మాటలు ప్లెజెంట్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఒక కథలో సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. రోహిణి మొల్లేటి, అదా శర్మ, వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ, సునైనా, సంచిత పూనాచ ఫీమేల్ లీడ్స్ గా, అశ్విన్ కుమార్, శివ కందుకూరి , దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా కథానాయకులుగా నటిస్తున్నారు. ఈ “మీట్ క్యూట్” ఐదు కథలతో క్యూట్ ఎంథాలజీగా ఉండబోతోంది.




ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ సోనీ లివ్ ఈ ఎంథాలజీ హక్కులను పొందింది, త్వరలో ప్రత్యేకంగా ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లో స్క్రీనింగ్ చేయనుంది. ఎంథాలజీ అంతా అందమైన యాదృచ్ఛిక సంఘటనలు, గొప్ప సంభాషణలు, హార్ట్ వార్మింగ్ క్షణాల సమాహారం. ఈ ఎంథాలజీలో ప్రముఖ తారాగణంతో పాటు, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. వసంత్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా, విజయ్ బుల్గానిన్ సంగీత సమకూర్చారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
Prepare yourself to watch the teaser of adorable urban love stories produced by @tprashantii and directed by @mail2ganta. #MeetCute presented by the Natural Star Nani is streaming soon on Sony LIV. #MeetCuteStories #MeetCuteOnSonyLIV #SonyLIV@walpostercinema @nameisnani pic.twitter.com/03Jvgo9p8w
— Sony LIV (@SonyLIV) November 12, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




