AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devatha Serial: మాధవ్ ను చంపిన సత్య.. నేరాన్ని తనమీద వేసుకున్న అక్క.. ముగిసిన దేవత సీరియల్.. త్వరలో సీజన్ టూ

మీ నాయన ఎవరు అని అడిగేదానివిగా ఈ సార్ మీ నాన్న.. బాగా చదువుకో.. అందరితోనూ మంచిగా ఉండు.. అని అప్పగింతలు చెబుతుంది.. చిన్మయిని కూడా జాగ్రత్తగా చూడమని తన ఫ్యామిలీ సభ్యులకు చెప్పి.. మాధవ్ ని చంపిన నేరం తన మీద వేసుకుంటుంది. చివరి సారిగా తన భర్త కళ్లకు మొక్కి పోలీసులతో పాటు వెళ్తుంది.

Devatha Serial: మాధవ్ ను చంపిన సత్య.. నేరాన్ని తనమీద వేసుకున్న అక్క.. ముగిసిన దేవత సీరియల్.. త్వరలో సీజన్ టూ
Devatha Serial
Surya Kala
|

Updated on: Nov 12, 2022 | 11:12 AM

Share

గత రెండున్నరేళ్ల ఏళ్లుగా తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న దేవత సీరియల్ కు శుభం కార్డు పడింది. దేవుడి ముందు కళ్ళుమూసుకుని ఉన్న రుక్మిణి మెడలో మాధవ్ తాళి కట్టడానికి ప్రయత్నిస్తాడు. రుక్మిణి వద్దు తప్పు అంటూ పారిపోతున్న వెంటపడి.. రుక్మిణి మేడలో తాళిని తెంపబోతున్న మాధవ్ ని సత్య చంపేస్తుంది. తన కోసం ఎన్నో త్యాగాలు చేసిన అక్కని సత్య క్షమించమని వేడుకుంటుంది. ఇంతలో అక్కడకు ఆదిత్య దేవుడమ్మ , దేవి చిన్మయి సహా కుటుంబ సభ్యులు వస్తారు.

ఆదిత్యకు దేవిని అప్పగిస్తూ.. నీ బిడ్డని నీకు అప్పగిస్తున్నా.. నా మాట నిలబెట్టుకున్న.. ఇక నైనా నువ్వు సత్య సంతోషంగా ఉండండి.. మీ నాయన ఎవరు అని అడిగేదానివిగా ఈ సార్ మీ నాన్న.. బాగా చదువుకో.. అందరితోనూ మంచిగా ఉండు.. అని అప్పగింతలు చెబుతుంది.. చిన్మయిని కూడా జాగ్రత్తగా చూడమని తన ఫ్యామిలీ సభ్యులకు చెప్పి.. మాధవ్ ని చంపిన నేరం తన మీద వేసుకుంటుంది. చివరి సారిగా తన భర్త కళ్లకు మొక్కి పోలీసులతో పాటు వెళ్తుంది.

ఇవి కూడా చదవండి

నటీనటుల సందడి:

మళ్ళీ కొంతకాలం తర్వాత రుక్మిణి నాగలి పట్టి పొలం దున్నుతూ కనిపిస్తుంది. ఈ సన్నివేశాన్ని అటుగా వెళ్తున్న ఆదిత్య, దేవుడమ్మ, దేవి చూస్తారు. మొదటి నుంచి నువ్వు అందరి కోసం బతికావు. చెల్లి, భర్త, పిల్లలు అంటూ బతికావు.. ఇప్పుడు ఓ అనాథకు అమ్మగా జీవిస్తున్నావు.. నువ్వు నిజంగా దేవతవు అని అత్త దేవుడమ్మ మనసులో తన కోడలి గొప్పదనాన్ని తలచుకుంటుంటే శుభం కార్డు పడింది.. అయితే దేవత ప్రయాణం ఇక్కడతో ఆగలేదని చెప్పడంతో.. సీజన్ టూ మళ్ళీ ప్రసారం అవుతుందని చెప్పకనే చెప్పారు సీరియల్ దర్శక, నిర్మాతలు..మరి సెకండ్ పార్ట్ లో కథను ఏ విధంగా నడిపిస్తారో చూడాలి మరి.. దేవి, చిన్మయిలను పెద్దవారిగా చేస్తారా.. అన్నది వేచి చూడాల్సిందే..

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..