AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geetu Royal: గుర్రం మీద రాణి లాగా వద్దామనుకున్నా.. చివరికి వారు కూడా మోసం చేశారు.. గీతూ కన్నీళ్లు

బిగ్ బాస్ హిస్టరీలో అందరి ఎలిమినేషన్స్ ఒక లెక్క. గలాటా గీతు ఎలిమినేషన్ ఒక లెక్క. అందరూ ఆట ఆడక బయటకి వస్తారు. కానీ గీతూ మాత్రం ఓవర్‌గా ఆడి ఎలిమినేట్ అయ్యింది.

Geetu Royal: గుర్రం మీద రాణి లాగా వద్దామనుకున్నా.. చివరికి వారు కూడా మోసం చేశారు.. గీతూ కన్నీళ్లు
Bigg Boss Geetu Royal
Ram Naramaneni
| Edited By: |

Updated on: Nov 12, 2022 | 3:27 PM

Share

గలాటా గీతు.. గీతు రాయల్.. ఈ సీజన్‌లో ఆమె ప్రవర్తన అందరూ చూసే ఉంటారు.  గత సీజన్స్‌లో ఎవరూ ప్లే చేయని స్ట్రాటజీలతో ఆమె దూసుకుపోయింది. ఆమె ఆటతీరు చూసి టాప్-5లో పక్కా ఉంటుందని అందరూ ఫిక్సయ్యారు. కానీ కనీసం గెస్ కూడా చేయలేని విధంగా ఆమె ఇంటికి వచ్చేసింది. ఎలిమినేషన్ సమయంలో గీతు పడిన బాధను చూస్తే.. ఆమె బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని ఎంత బలంగా ఫిక్సయ్యిందో అర్థమయ్యింది. కానీ తప్పులకు పరిహారం తప్పదు. ఆత్మవిశ్వాసం ఉండాలి.. కానీ అతి విశ్వాసం ఉండకూడదు. నేనే తోపు.. నేను మాత్రమే తోపు అనుకుంటే.. సప్త సముద్రాలు ఈదొచ్చి కూడా పిల్ల కాలువలో పడి చావాల్సి ఉంటుంది. గీతు విషయంలో అదే జరిగింది. ఆమె లూప్‌లు లాజిక్‌లు మిస్ ఫైర్ అయ్యాయి. ఫైనల్‌గా 9వ వారమే తట్టా, బుట్టా సర్దుకుని ఇంటికి రావాల్సి వచ్చింది.

కాగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక 2 రోజులు సైలెంట్‌గా ఉన్న గీతూ.. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతుంది. తాజాగా తను బిగ్ బాస్ హౌస్ నుంచి తన ఇంటకి వచ్చినప్పుడు తీసిన వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.

“ఇది జీవితంలో అత్యంత అందమైన ప్రయాణం ❤️

కానీ చాల ఎమోషనల్ గా ఎండ్ అయింది?

.

నా ఎగ్జిట్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నా! ఒక గుర్రం మీద రాణి లాగా వద్దామని..

ఇంత ధారుణంగా అవుతుండి అనుకోలేదు !!

.

నా ప్రాణం పెట్టాను బిగ్‌బాస్ కోసం!

ప్రాణాలే పోయినంత బాధలో తిరిగొచ్చాను!!

.

చాలా ఒక్క ఆశపడ్డా, ఆవేశపడ్డా అని బైటికొచ్చాకే అర్దమైంది !

.

నా నుండి మీరు నేర్చుకోకూడదని 2 నీతులు

1. అతి విశ్వాసం వద్దు!

2. ఇతరుల మాట వినండి!.

BIGGBOSS మీద నాకున్న ప్రేమలో ఓడిపోయాను..

మీరు నా మీద పెట్టుకున్న ప్రేమలో ప్రాణం పోయిన మిమ్మల్ని ఓడిపోనివ్వను.. ప్రామిస్ ❤️?”  అంటూ గీతూ రాసుకొచ్చింది. 

ఇక తాను పీఆర్ టీమ్‌ని పెట్టుకోలేదని గీతూ స్పష్టం చేసింది. అయితే తనపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు.. పాజిటివ్ కామెంట్లు పెట్టడానికి ఒకరితో డీల్ మాట్లాడుకున్నట్లు తెలిపింది. వాళ్లకి రూ.25 వేలు కూడా ఏం చేయలేదని వాపోయింది. తన దగ్గర తీసుకుని వాళ్లు కూడా మోసం చేశారని ఆరోపించింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌
బజాజ్‌ పల్సర్‌ 150కి కొత్త లుక్‌.. కొత్త రంగులతో ఎల్‌ఈడీ లైట్స్‌