Guntur Kaaram OTT: మహేశ్‌ ‘గుంటూరు కారం’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఇదే.. స్ట్రీమింగ్‌కు ఎప్పుడు రావొచ్చంటే?

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. తల్లీ, కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ లో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. మీనాక్షి చౌదరి మరో లీడ్‌ రోల్‌లో మెరిసింది. సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 12) థియేటర్లలో విడుదలైన గుంటూరు కారం సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది

Guntur Kaaram OTT: మహేశ్‌ 'గుంటూరు కారం' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఇదే.. స్ట్రీమింగ్‌కు ఎప్పుడు రావొచ్చంటే?
Guntur Kaaram Movie
Follow us
Basha Shek

|

Updated on: Jan 12, 2024 | 11:25 AM

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా గుంటూరు కారం. తల్లీ, కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ లో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. మీనాక్షి చౌదరి మరో లీడ్‌ రోల్‌లో మెరిసింది. సంక్రాంతి కానుకగా శుక్రవారం (జనవరి 12) థియేటర్లలో విడుదలైన గుంటూరు కారం సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. మహేశ్‌ మ్యాజిక్‌, శ్రీలీల అంద చందాలు, డ్యాన్స్‌, త్రివిక్రమ్‌ డైలాగులు సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. అలాగే తల్లీ కొడుకుల సెంటిమెంట్‌ కూడా బాగా వర్కవుట్ అయ్యిందని టాక్‌ వినిపిస్తోంది. మొత్తానికి గుంటూరు కారంతో మహేశ్‌ ఖాతాలో మరో సూపర్‌ హిట్‌ చేరినట్లే. ఇక గుంటూరు కారం సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసిందని సమాచారం. ఇందుకోసం భారీ డీల్ కుదుర్చుకుందని సమాచారం. మహేశ్‌- త్రివిక్రమ్‌ల హ్యాట్రిక్‌ కాంబినేషన్‌.. టీజర్స్‌, ట్రైలర్లు ఆసక్తిగా ఉండడంతో గుంటూరు కారం స్ట్రీమింగ్‌ రైట్స్‌ భారీ మొత్తంలో అమ్ముడుపోయాయని టాక్‌ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

జనవరి 12న గుంటూరు కారం సినిమా థియేటర్లలో రిలీజైంది. కాబట్టి థియేట్రికల్‌ రిలీజ్‌ తర్వాత నెలరోజులకు నెట్‌ఫ్లిక్స్‌లో మహేశ్‌ సినిమాను స్ట్రీమింగ్‌ను చేసేలా ఒప్పందం కుదిరిందని సమాచారం. అంటే ఫిబ్రవరి మూడో వారం లేదా ఆఖరి వారంలో గుంటూరు కారం ఓటీటీలోకి అందుబాటులోకి రావొచ్చన్నమాట. రమ్యకృష్ణ, జయరాం, ఈశ్వరి రావు, మురళీ శర్మ, జగపతిబాబు, బ్రహ్మాజీ, అజయ్‌, రావు రమేశ్‌, వెన్నెల కిషోర్, ప్రకాష్ రాజ్, సునీల్‌ తదితరులు గుంటూరు కారంలో ప్రధాన పాత్రలు పోషించారు. తమన్‌ స్వరాలు అందించారు. హారిని అండ్‌ హాసిని క్రియేష్స్‌ బ్యానర్‌పై ఎస్‌. రాధాకృష్ణ గుంటూరు కారం సినిమాను నిర్మించారు.

గుంటూరు కారం ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.