Sarkaaru Noukari: ఓటీటీలోకి వచ్చేసిన ‘సర్కారు నౌకరి’.. ఎక్కడ చూడొచ్చంటే..
తాజాగా మరో మూవీ అడియన్స్ కు అందుబాటులోకి వచ్చేసింది. అదే 'సర్కారు నౌకరి'. సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ గోపరాజు హీరోగా పరిచయమైన ఈ సినిమా ఇది. డిఫరెంట్ టైటిల్, వైవిధ్యమైన కథ కథనాలతో మొదటి సినిమాతోనే నటనపరంగా మెప్పించాడు ఆకాష్. నూతన సంవత్సరం కానుకగా ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన పన్నెండు రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ హిట్స్ అంటూ టాక్ వస్తుంది. ఇక ఇటు ఓటీటీలోనూ పలు చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. తాజాగా మరో మూవీ అడియన్స్ కు అందుబాటులోకి వచ్చేసింది. అదే ‘సర్కారు నౌకరి’. సింగర్ సునీత కుమారుడు ఆకాశ్ గోపరాజు హీరోగా పరిచయమైన ఈ సినిమా ఇది. డిఫరెంట్ టైటిల్, వైవిధ్యమైన కథ కథనాలతో మొదటి సినిమాతోనే నటనపరంగా మెప్పించాడు ఆకాష్. నూతన సంవత్సరం కానుకగా ఈ ఏడాది జనవరి 1న థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన పన్నెండు రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు థియేటర్లలలో మిస్ అయినవారు ఇప్పుడు నేరుగా ఇంట్లోనే చూడొచ్చు.
ఈ చిత్రాన్ని గంగనమోని శేఖర్ తెరకెక్కించగా.. ఆర్కే టెలిషో బ్యానర్ పై దర్శకుడు రాఘవేంద్రరావు ఈ సినిమాను నిర్మించారు. ఇందులో భావన కథానాయికగా నటించింది. ఈ చిత్రంతోనే హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది భావన. ఇందులో తనికెళ్ల భరణి, మధులత కిీలకపాత్రలు పోషించారు. ఎయిడ్స్, కండోమ్స్ పై అవగాహన కల్పిస్తూ రూపొందించిన ఈ సినిమాలో ఆకాష్ గోపరాజు నటనకు మంచి మార్కులే పడ్డాయి.
Sounds intriguing! The storyline of #SarkaaruNoukari, focusing on a man’s vision for societal change, promises a powerful narrative. Looking forward to immersing myself in this compelling journey. 🎬🌟
Great to know! Enjoy streaming #SarkaaruNoukari on @primeindia. Happy… pic.twitter.com/zbwFdi1Ywd
— I’m_Film Lover_Sri* (@srinu027) January 12, 2024
కథ విషయానికి వస్తే..
ఇందులో గోపాల్ (ఆకాష్ గోపరాజు) ఎయిడ్స్ పై అవగాహన కల్పించే ఉద్యోగం చేస్తుంటాడు. కండోమ్స్ పంచే జాబ్ చేసే అతనికి సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి. ?.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సత్య (భావన) అతడికి ఎందుకు దూరమైంది ? అన్నది ఈసినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా లేకపోవడంతో ఈ సినిమా ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ అందుకోలేకపోయింది.
Immerse yourself in the powerful story of #SarkaaruNoukari, where a man’s vision for societal change unfolds🏥
STREAMING NOW ON @PrimeVideoIN ▶️ https://t.co/KvyxEOvlFT@Ragavendraraoba @ShekarPhotos @AkashGoparaju98 @BVazhapandal @vasuanv @MangoMusicLabel pic.twitter.com/jk5jJdmi6T
— Mango Videos (@mangovideos) January 12, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.