AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Veerappan: స్వయంగా వీరప్పన్ చెప్పిన సంఘటనలతో డాక్యుమెంటరీ సిరీస్.. ‘కూసీ మునిసామీ వీరప్పన్’ ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..

వీరప్పన్ స్వయంగా తన గురించి.. 90వ దశకంలో తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో అడవుల గురించి చెబితే ఎలా ఉంటుంది. కానీ తన జీవితం గురించి స్వయంగా వీరప్పన్ చెప్పిన అంశాల ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ సిరీస్ 'కూసీ మునుసామి వీరప్పన్'. 1993, 1996 మధ్యకాలంలో వీరప్పన్‏ను ఇంటర్వ్యూ చేయడానికి అడవిలోకి వెళ్లిన నక్కీరన్ గోపాల్ అనే విలేకరి చేసిన వీడియోస్, వీరప్పన చెప్పిన తన జీవిత కథల ఆధారంగా ఈ సిరీస్‏ను రూపొందించారు.

Veerappan: స్వయంగా వీరప్పన్ చెప్పిన సంఘటనలతో డాక్యుమెంటరీ సిరీస్.. 'కూసీ మునిసామీ వీరప్పన్' ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..
Veerappan
Rajitha Chanti
|

Updated on: Dec 14, 2023 | 2:31 PM

Share

వీరప్పన్ ఈ పేరు తెలియని వారండరు. గంధపు చెక్కలు స్మగ్లర్‏ వీరప్పన్ గురించి ఇప్పటివరకు చాలా కథనాలు వచ్చాయి. అనేక సినిమాలు, సీరియల్స్ ప్రజల ముందుకు వచ్చాయి. అతడిని సంప్రదించిన పోలీసులు చెప్పిన కథలు.. అతడి గురించి తెలుసుకున్న విలేకరులు చెప్పిన కథలు.. అతడితో ప్రయాణం చేసిన వ్యక్తులు చెప్పిన కథలు మాత్రమే ఇప్పటివరకు జనాల ముందుకు తీసుకొచ్చారు. కానీ వీరప్పన్ స్వయంగా తన గురించి.. 90వ దశకంలో తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో అడవుల గురించి చెబితే ఎలా ఉంటుంది. కానీ తన జీవితం గురించి స్వయంగా వీరప్పన్ చెప్పిన అంశాల ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ సిరీస్ ‘కూసీ మునుసామి వీరప్పన్’. 1993, 1996 మధ్యకాలంలో వీరప్పన్‏ను ఇంటర్వ్యూ చేయడానికి అడవిలోకి వెళ్లిన నక్కీరన్ గోపాల్ అనే విలేకరి చేసిన వీడియోస్, వీరప్పన చెప్పిన తన జీవిత కథల ఆధారంగా ఈ సిరీస్‏ను రూపొందించారు. ఇప్పటివరకు వచ్చిన అన్ని సిరీస్ లకు ఈ డాక్యుమెంటరీ సిరీస్ భిన్నంగా ఉంటుంది.

ధీరన్ ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించిన ఈ సిరీస్ కు శరత్ జ్యోతీ దర్శకత్వం వహించారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్ ఈరోజు (డిసెంబర్ 14) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. వీరప్పన్ తొలిరోజులు.. అతడు చేసిన మొదటి హత్య, ఆ తర్వాత శిభిరాల్లో పౌరులపై పోలీసులు చిత్రహింసలు, పోలీసులకు, వీరప్పన్ కు మధ్య చిక్కుకున్న ప్రజల కష్టాలను ఈ సిరీస్ లో చూపించినట్లు తెలుస్తోంది. ఈరోజు చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న నక్కీరన్ గోపాలన్ మాట్లాడుతూ.. “నక్కీరన్ అంటే ధైర్యం కావాలనీ.. ఆ తర్వాత వీరప్పన్ అంటే ఇంకా ధైర్యం కావాలి. కూసీ మునిసామి వీరప్పన్ డాక్యుమెంటరీ సిరీస్ తో ఈరెండింటినీ సాధ్యం చేశారు.” అని అన్నారు.

వీరప్పన్ కథతో సినిమాను చేయడానికి చాలా మంది తన వద్దకు వచ్చారని.. తన కూతురు అడగడానికి ముందు దివంగత దర్శకులు బాలు మహేంద్ర కూడా అడిగారని అన్నారు నక్కీరన్. కానీ ఈ సిరీస్ సరిగ్గా చేయాలన్న ఉద్దేశంతో తాను వీరప్పన్ ను ఇంటర్వ్యూ చేసిన వీడియోను ఎవరికీ ఇవ్వలేదని అన్నారు. ఈ వీడియో కోసం తన టీమ్ చాలా కోల్పోయినట్లు తెలిపారు. ఈ డాక్యుమెంటరీ సిరీస్ స్వయంగా వీరప్పన్ చెప్పిన విషయాలతో, సంఘటనలతో రూపొందించమని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.