AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepavali OTT: తాత, మనవడు, ఓ మేక.. ఓటీటీలోకి ఇంటర్నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

నవంబర్‌ 11న థియేటర్లలో విడుదలైన దీపావళి సినిమా ఆడియెన్స్‌ను బాగా ఆలరించింది. హృదయాన్ని కదిలించే కథా కథనాలు, ఎమోషన్స్‌ బలంగా ఉండడం ఈ సినిమ విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. థియేటర్లలో అలరించిన దీపావళి సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Deepavali OTT: తాత, మనవడు, ఓ మేక.. ఓటీటీలోకి ఇంటర్నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Deepavali Movie
Basha Shek
|

Updated on: Dec 14, 2023 | 6:25 PM

Share

ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సినిమాల్లో తమిళ్‌ మూవీ కిడా కూడా ఒకటి. తెలుగులో దీపావళి పేరుతో రిలీజైంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు అందాయి. అంతేకాదు పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో స్పెషల్‌ స్ర్కీనింగ్‌కు కూడా ఎంపికైంది. టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత స్రవంతి రవికిశోర్‌ ఈ సినిమాను నిర్మించడం విశేషం. నవంబర్‌ 11న థియేటర్లలో విడుదలైన దీపావళి సినిమా ఆడియెన్స్‌ను బాగా ఆలరించింది. హృదయాన్ని కదిలించే కథా కథనాలు, ఎమోషన్స్‌ బలంగా ఉండడం ఈ సినిమ విజయంలో ప్రధాన పాత్ర పోషించాయి. థియేటర్లలో అలరించిన దీపావళి సినిమా ఇప్పుడు డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా ఈ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌ హక్కులను సొంతం చేసుకుంది. శుక్రవారం (డిసెంబర్‌ 15) నుంచి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది.

మనవడి కొత్త బట్టల కోసం మేక తాకట్టు..

ఆర్‌. వెంకట్ దర్శకత్వంలో తెరకెక్కిన దీపావాళి సినిమాలో రాము, కాళీ వెంకట్‌, దీపన్‌, పాండియమ్మ, విజయ, లక్ష్మి, కమలి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థీసన్‌ స్వరాలు సమకూర్చారు. ఇక దీపావళి సినిమా మొత్తం ఓ పల్లెటూరిలో జరుగుతుంది. తాత, మనవడు, ఓ మేక మధ్య ఉన్న అనుబంధాన్ని ఆవిష్కరిస్తుంది. దీపావళి పండక్కి కొత్త బట్టలు కొనివ్వాలని మనవడు కోరడంతో మేకను అమ్మడానికి సిద్ధపడతాడు తాత. అయితే మొక్కు ఉన్న మేక కావడంతో దానిని కొనేందుకు ఎవరూ ముందుకురారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? తాత తన మనవడికి కొత్త బట్టలు కొనిచ్చాడా లేదా తెలుసుకోవాలంటే దీపావళి సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

దీపావళి సినిమా ట్రైలర్..

అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో స్పెషల్ స్క్రీనింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చీప్‌గా చూడొద్దు.. ఆ సమస్యలకు అద్భుతమైన ఔషధం.. ఉదయాన్నే ఇలాచేస్తే
చీప్‌గా చూడొద్దు.. ఆ సమస్యలకు అద్భుతమైన ఔషధం.. ఉదయాన్నే ఇలాచేస్తే
ఆ హీరోయిన్ లాంటి చావు ఇండస్ట్రీలో ఎవరికీ రావొద్దు..
ఆ హీరోయిన్ లాంటి చావు ఇండస్ట్రీలో ఎవరికీ రావొద్దు..
ఎడారిలో మంచు వర్షం..అరేబియా దేశాల్లో వింత వాతావరణం.. కారణం ఇదేనా?
ఎడారిలో మంచు వర్షం..అరేబియా దేశాల్లో వింత వాతావరణం.. కారణం ఇదేనా?
ఏపీలోని ప్రజలకు సూపర్ న్యూస్..
ఏపీలోని ప్రజలకు సూపర్ న్యూస్..
'నాకు ఇలాంటి సినిమాలు నచ్చవు'.. 'ధురంధర్ 2' పై హీరో విమర్శలు
'నాకు ఇలాంటి సినిమాలు నచ్చవు'.. 'ధురంధర్ 2' పై హీరో విమర్శలు
ఎక్కువ టైం కూర్చుంటే.. మీ శరీరంకు రహస్య ప్రమాదం ఏమిటో తెలుసా?!
ఎక్కువ టైం కూర్చుంటే.. మీ శరీరంకు రహస్య ప్రమాదం ఏమిటో తెలుసా?!
రైళ్లల్లో మిడిల్ బెర్త్ ప్రయాణికులకు అలర్ట్.. రైల్వేశాఖ నిబంధనలు
రైళ్లల్లో మిడిల్ బెర్త్ ప్రయాణికులకు అలర్ట్.. రైల్వేశాఖ నిబంధనలు
ఆ హీరోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్! ఏం జరిగిందంటే?
ఆ హీరోకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్! ఏం జరిగిందంటే?
పొరపాటున కూడా ఈ8 విషయాలు ఎవ్వరికీ చెప్పకండి..ఆనందం ఆవిరై పోతుంది!
పొరపాటున కూడా ఈ8 విషయాలు ఎవ్వరికీ చెప్పకండి..ఆనందం ఆవిరై పోతుంది!
ఆ భక్తుడి ఒళ్లంతా బంగారమే.. తిరుమలలో గోల్డ్‌మ్యాన్ సందడి..
ఆ భక్తుడి ఒళ్లంతా బంగారమే.. తిరుమలలో గోల్డ్‌మ్యాన్ సందడి..