Max OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న సుదీప్ మ్యాక్స్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..
2024 చివర్లో విడుదలైన సూపర్ హిట్ చిత్రాల్లో మ్యాక్స్ ఒకటి. కన్నడ స్టార్ హీరో సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ మూవీని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలాగే ఓటీటీతోపాటు ఇటు టీవీల్లోనూ విడుదల చేయనున్నారు.

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ మ్యాక్స్. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్లలో విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత, ఈ సినిమా ఓటీటీ, టీవీలోకి అడుగుపెడుతోంది. ‘మ్యాక్స్’ సినిమా ఫిబ్రవరి 15న ‘జీ కన్నడ’ జీ5లో అందుబాటులోకి రానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కోలీవుడ్ దర్శకుడు విజయ్ కార్తికేయన్ దర్శకత్వం వహించారు. కన్నడతోపాటు తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయగా.. పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీతోపాటు, టీవీలో ఒకేసారి ప్రసారం అవుతుందని తెలిసి అభిమానులు సంతోషిస్తున్నారు.
‘మ్యాక్స్’ సినిమా థియేటర్లలో విడుదలకు ముందే జీ కన్నడ టెలివిజన్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఫిబ్రవరి 15న సాయంత్రం 7:30 గంటలకు టీవీలో ప్రసారం ప్రసారం కానుంది. అదే సమయంలో ‘జీ 5’ ఓటీటీలో సైతం స్ట్రీమింగ్ కానుంది. కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళంలోనూ ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. కోలీవుడ్ నిర్మాత కలైపులి ఎస్. ధను ‘మ్యాక్స్’ సినిమాను నిర్మించారు. కిచ్చా సుదీప్ తో పాటు, ఉగ్రం మంజు, వరలక్ష్మి శరత్ కుమార్, సంయుక్త హొరనాడు, సుకృత వాగ్లే, విజయ్ చెల్లూర్, సుధ బెలవాడి, శరత్ లోహితాశ్వ, సునీల్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు.
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీతోపాటు టీవీల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. ‘మ్యాక్స్’ సినిమా ఒకే రాత్రిలో జరిగే థ్రిల్లర్ కథ. యాక్షన్ సన్నివేశాల్లో సుదీప్ మెరిశాడు.
The MAXxive blockbuster from Kannada cinema!
Premieres 15th February@KicchaSudeep @theVcreations @Kichchacreatiin @vijaykartikeyaa @AJANEESHB @shekarchandra71 @ganeshbaabu21 @shivakumarart @dhilipaction @kevinkumarrrr @ChethanDsouza @shobimaster @saregamasouth @ZeeKannada pic.twitter.com/ox5wN6U4OO
— ZEE5 Telugu (@ZEE5Telugu) February 13, 2025
ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..
Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..
Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్లోకి వెళ్లిపోయిన